మోనాలిసా.. కేసులో కొత్త మలుపు! ఇప్పుడు గర్భవతి.. ప్రయాణాలు చేయలేదు.
ABN , Publish Date - Apr 24 , 2026 | 07:54 AM
కుంభమేళాతో ఓవర్ నైట్ స్టార్ అయిన మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ కేసు కొత్త టర్న్ తీసుకుంది.
ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ కెమెరా కంటికి చిక్కి ఓవర్‌నైట్‌లో స్టార్ అయిపోయింది మోనాలిసా భోంస్లే (Monalisa). ఆపై సోషల్ మీడియాలో ఎనలేని పాపులారిటీ దక్కించుకుని సినిమా ఆఫర్లు సైతం పట్టేసింది. తెలుగులోనూ ఓ మూవీలో నటించింది. కానీఆమె నటించిన సినిమాలేవి ఇప్పటి వరకు రిలీజ్ కాకపోగా అంతా తన క్రేజ్‌ను ఉపయోగించుకునేందుకు ఎగబడ్డారు.
ఈ నేపథ్యంలోనే ఫర్మాన్ ఖాన్ (Farman Khan)అనే వ్యక్తితో ప్రేమలో పడడం అఖరికి గత నెలలో తన ఇంటిని, కుటుంబాన్ని సైతం వదిలేసి వచ్చి సదరు వ్యక్తితో నాటకీయ పరిణామాల మధ్య కేరళంలో మార్చి11న పెళ్లి చేసుకోవడం అంతా తతంగమే నడిచింది. ఈ వివాహం వివాదానికి దారి తీయగా దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది.ఆపై మోనాలిసా ఇంకా మైనరే అంటూ ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో ఫర్మాన్‌పై ఫోక్సో యాక్ట్ (POCSO Act) కేసు నమోదైంది.
అయితే.. తాజాగా ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు మోనాలిసాను హజరుకావాలని కోరడంతో కేసు ఊహించని టర్న్ తీసుకుంది. మోనాలిసా ప్రస్తుతం గర్భవతి అని దూరం ప్రయాణించలేని స్థితిలో ఉందని ఫర్మాన్ మధ్య ప్రదేశ్ పోలీసులను అశ్రయించడంతో ఈ వ్యవహారం ఇప్పుడు మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వార్తలు కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ న్యూస్ నిజమా లేక కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలేమైనా చేస్తున్నారా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.
అయితే.. పెళ్లి జరిగిన 45 రోజుల్లోనే గర్భం రావడంపై అంతా ఆశ్యర్యం వ్యక్తం చేస్తుండగా ఫర్మాన్ చెప్పిన విషయాల నిగ్గు తేల్చేందుకు పోలీసులు రంగంలోకి దిగేందుకు సమాయత్తం అవుతున్నారు. మోనాలిసాకు వైద్య పరీక్షలు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఒకవేళ మోనాలిసా గర్భవతి అని తేలితే ఈ కేసు మరో మలుపు తీసుకునే అవకాశం ఉంది.
ప్రధానంగా మైనర్ వివాహమే చెల్లనప్పుడు ఇప్పుడు మోనాలిసా తల్లి కాబోతున్నదనే విషయం నిరూపణ అయితే కేసు కఠినంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కేసులో మోనాలిసా మెడికల్ రిపోర్ట్స్ కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో ఈ కేసు విషయంలో ఇంకెన్ని వినాల్సి వస్తుంది, చూడాల్సి ఉంటుందో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.