మాధురి రాథోడ్ ఇష్యూ.. ఈశ్వర్ సాయి భార్య‌పై కేసు

ABN , Publish Date - Sep 08 , 2026 | 05:21 PM

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ సోమవారం మరోసారి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు.

Madhuri Rathod

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ (Madhuri Rathod) సోమవారం మరోసారి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకొని మోసం చేశాడని మాధురి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాను ఫిర్యాదు చేసి నాలుగు రోజులు గడిచినా ఈశ్వర్ సాయి (eshwa sai) పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆదివారం ఆత్మహత్యాయత్నం చేసింది.

దాంతో పోలీసులు సోమవారం మరో సారి బాధితురాలిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి స్టేట్మెంట్ రికార్డు చేశారు. 24 గంటల్లో ఈశ్వర్ సాయిని పట్టుకుంటామని వెల్లడించినట్లు తెలిసింది. అంతేకా కుండా తన వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి పరువుకు భంగం కలిగించి, మానసిక వేదనకు గురిచేసిన ఈశ్వర్ సాయి భార్య శరణ్య, మరో మహిళ సంధ్యారాణిపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో వారిపై మరో కేసు నమోదు చేసినట్లు సమాచారం.

Updated Date - Sep 08 , 2026 | 05:25 PM