సికింద్రాబాద్‌లో.. మెగా కోడ‌లు సంద‌డి

ABN , Publish Date - Mar 29 , 2026 | 10:00 PM

మెగా కోడ‌లు, వ‌రుణ్ తేజ్ శ్రీమ‌తి లావ‌ణ్య ఆదివారం సికింద్రాబాద్‌లో సంద‌డి చేసింది.

Lavanya Tripathi

మెగా కోడ‌లు, వ‌రుణ్ తేజ్ శ్రీమ‌తి లావ‌ణ్య ఆదివారం సికింద్రాబాద్‌లో సంద‌డి చేసింది. వెంకటరమణ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆర్.పి. రోడ్‌లో నూత‌నంగా ఏర్పాటు చేసిన తమ 14వ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను లావణ్య త్రిపాఠి ప్రత్యేక అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అభిమానులు, ఆభరణ ప్రియులు, ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని మరింత వైభవంగా మార్చారు.

శ్రీ వెంకటరమణ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ సంప్రదాయం, వారసత్వం, సాంస్కృతిక విలువలను ప్రతిబింబించే బంగారం మరియు వజ్రాభరణాలతో వినియోగదారులకు అత్యుత్తమ సేవలను అందిస్తోంది. వినూత్న డిజైన్లు, నైపుణ్యం, నాణ్యతతో ఈ బ్రాండ్ ప్రత్యేక గుర్తింపును సంపాదించింది.

ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ శ్రీ మనీష్ మాట్లాడుతూ.. కస్టమర్లకు నాణ్యమైన ఆభరణాలు అందించడం తమ ముఖ్య లక్ష్యమని తెలిపారు. ప్రతి ఒక్కరికీ నమ్మకంతో కూడిన షాపింగ్ అనుభవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ స్టోర్‌ను ప్రారంభించామని చెప్పారు. ప్రతి కస్టమర్‌కు ఇంటివాడిలా అనిపించే అనుభవాన్ని అంద‌జేస్తామ‌న్నారు. ఆధునిక తతో కూడిన సంప్రదాయ డిజైన్లు, పెళ్లిళ్లు, వధూవరాల వేడుకలు, ప్రత్యేక సందర్భాల కోసం విభిన్న కలెక్షన్లు ఈ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి.

Updated Date - Mar 29 , 2026 | 10:00 PM