Movies: సినిమాలు చూస్తే.. వృద్ధాప్యం దూరం! జపాన్ పరిశోధకులు
ABN , Publish Date - Jul 16 , 2026 | 07:25 PM
తరచుగా సినిమాలు, సంగీత కచేరీలకు వెళ్లడం, మ్యూజియంలు సందర్శించడం వల్ల వృద్ధాప్యం తొందరగా దరిచేరదని జపాన్ పరిశోధకులు తాజా అధ్యయనంలో గుర్తించారు.
తరచుగా సినిమాలు, సంగీత కచేరీలకు వెళ్లడం, మ్యూజియంలు సందర్శించడం వల్ల వృద్ధాప్యం తొందరగా దరిచేరదని జపాన్ పరిశోధకులు తాజా అధ్యయనంలో (Japan Study) గుర్తించారు. సాంస్కృతిక కార్యక్రమాలకు, శారీరక వృద్ధాప్యానికి ఉన్న సంబంధాన్ని గుర్తించేందుకు వారు ఒక అధ్య యనం నిర్వహించారు.
ఈ క్రమంలో ప్రతి కొన్ని నెలలకొకసారి సినిమాలకు వెళ్లడం, మ్యూజియంలు లేదా ఆర్ట్ గ్యాలరీలను సందర్శించడం, సంగీత కచేరీ లకు వెళ్లడం వంటి అలవాట్లు ఉన్నవారి శరీరం.. ఈ అలవాట్లేమీ లేని వారి శరీరంతో పోలిస్తే మూడు సంవత్సరాలు యవ్వనంగా ఉన్నట్టు గుర్తించారు.
సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనని వారి శారీరక సగటు వయస్సు 69.9 ఏళ్లుగా ఉంటే.. అదే వయస్సు ఉండి సాంస్కృతిక కార్యక్రమాల్లో తరచుగా పాల్గొనే వారి బయోలాజికల్ ఏజ్ 66.9 ఏళ్లుగా గుర్తించామని పరిశోధకులు తెలిపారు.