Rashmi Gautam: దేశీ కుక్కలను.. పెంచుకోవడం మంచిది

ABN , Publish Date - Sep 09 , 2026 | 09:58 AM

మన దేశీ కుక్కలను పెంచుకోవడం మంచిది మనతో బాగా కలిసిపోతాయి' అని అన్నారు యాంకర్ రష్మీ గౌతమ్.

Rashmi Gautam

'లక్షలు పోసి విదేశీ జాతుల కుక్కలను కొనుగోలు చేసి వాటిని సరిగా చూసుకోలేక రోడ్ల మీద వదిలేయడం కంటే మన దేశీ కుక్కలను పెంచుకోవడం మంచిది. పైగా ఆరోగ్యంగా ఉంటాయి. మనతో బాగా కలిసిపోతాయి' అని అన్నారు యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam).

శ్రీనగర్ కాలనీలో యానిమల్ ప్లేస్ వెటర్నరీ క్లినిక్ ఆమె ప్రారంభించారు. తనకు జంతువులంటే చాలా ఇష్టమని ఈ సందర్భంగా రష్మి తెలిపారు. ఆధునిక వైద్యం, అసలైన కరుణ అనే సిద్ధాంతంతో తాము సేవలందిస్తామని డాక్టర్లు సలీం మస్కతి, మార్షా గాబ్రియేల్ అన్నారు. పెంపుడు జంతువులకు అవసరమైన సేవల న్నింటినీ ఇక్కడ అందిస్తామని చెప్పారు.

Updated Date - Sep 09 , 2026 | 09:58 AM