ఫిల్మ్ ఫెస్టివల్ బహుమతుల ప్రదానం

ABN , Publish Date - Nov 18 , 2026 | 05:19 AM

తొలి లఘుచిత్రం 'కంచె చేను మేస్తే'తోనే శ్రీజ సాదినేని ఉత్తమ దర్శకురాలి అవార్డును సొంతం చేసుకున్నారు.

Sreeja Sadineni

బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని, దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) జయంతి సందర్భంగా టాలివుడ్ క్రియేటివ్ డైరెక్టర్ అసోసియేషన్, రెయిన్‌బో చిల్డ్రన్స్ పిలిం సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ పిల్మ్ ఫెస్టివల్ (International Film Festival) బహుమతుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. రవీంద్రభారతి (RavindraBharathi) పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ (The Paidi Jairaj Preview Theatre) లో జరిగిన ఈ కార్యక్రమంలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

ఇందులో కంచె చేను మేస్తే (Kanche Chenu Meste) షార్ట్ ఫిలింకు (Short Film Awards) గాను ఉత్తమ దర్శకురాలిగా శ్రీజ సాదినేని (Sreeja Sadineni) నిలిచారు. తన తొలి లఘు చిత్రానికే బెస్ట్ డైరెక్టర్ అవార్డు రావడం ఆనందంగా ఉందని శ్రీజ సాదినేని అన్నారు. రంగస్థలంపై ఇప్పటికే 47 నాటకాలకు దర్శకత్వం వహించిన తాను తొలిసారి లఘుచిత్రం చిత్రీ కరించానని అన్నారు. ఈ అవార్డు తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో వెండితెరపై దర్శకురాలిగా తనదైన ముద్రవేస్తానని శ్రీజ అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ భాషా సాం స్కృతిక శాఖ సంచాలకుడు ఏనుగు నరసింహారెడ్డితో పాటు పలు వురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

Updated Date - Nov 18 , 2026 | 05:29 AM