జియోహాట్ స్టార్ గ్లోబల్ ఎంట్రీ.. పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా మార్కెట్లలోకి సేవలు!
ABN , Publish Date - Oct 08 , 2026 | 08:04 AM
భారతీయ స్ట్రీమింగ్ దిగ్గజం జియోహాట్ స్టార్ (Jio Hotstar).. అంతర్జాతీయంగా తన సేవలను విస్తరిస్తోంది.
భారతీయ స్ట్రీమింగ్ దిగ్గజం జియోహాట్ స్టార్ (Jio Hotstar).. అంతర్జాతీయంగా తన సేవలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా పశ్చిమాసియా (West Asia), ఉత్తర ఆఫ్రికా (North Africa) దేశాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ప్రాంతీయ ఓటీటీ ప్లాట్ ఫామ్ స్టార్ తో జట్టు కట్టినట్లు వెల్లడించింది.
ఒప్పందంలో భాగంగా స్టార్ యాప్, వెబ్సైట్ ద్వారా అక్కడ ఉన్న దక్షిణాయాసియా వాసులకు జియోహాట్ స్టార్ ఒరిజినల్స్, లైవ్ క్రికెట్, టీవీ షోలతోపాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం సహా 10 భారతీయ భాషల్లో సినిమాలు అందుబాటులోకి వస్తాయి.