హైదరాబాద్‌లో దారుణం.. సీరియళ్లలో ఛాన్స్ ఇప్పిస్తానని యువతికి గాలం! ఆపై

ABN , Publish Date - Nov 15 , 2026 | 08:24 AM

టీవీ సీరియళ్లు, రీల్స్‌లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి యువతిపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

Harassment

టీవీ సీరియళ్లు, రీల్స్ ల‌లో అవకాశాలు (TV Serial Opportunities Fraud) ఇప్పిస్తానని నమ్మించి ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా, అసభ్యకర ఫొటోలు చూపిస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌కు చెందిన యువతి సినీ అవకాశాల కోసం ప్రయత్నిస్తుంది.

ఈ క్రమంలో బంజారాహిల్స్‌లోని జవహర్ కాలనీకి చెందిన బొరగడ్డ కాళిదాస్ పరిచయమయ్యాడు. టీవీ సీరియళ్లలో నటించే అవకాశాలు ఇప్పిస్తానని, అలాగే రీల్స్ చేస్తూ యూట్యూబ్ ద్వారా భారీగా డబ్బులు సంపాదించవచ్చని యువతికి ఆశ చూపాడు.

ఆపై పరిచయం పెంచుకొని, ఇందిరానగర్ జవహర్ కాలనీలో పలుమార్లు బలవంతంగా లైంగికదాడికి పాల్పడ్డాడు. రహస్యంగా ఫొటోలు తీశాడు. ఆ తర్వాత తన వద్దకు రాకపోతే ఫొటోలను బందువులకు పంపడమే కాకుండా, సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని, చంపేస్తానని బెదిరింపులకు గురిచేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు (Banjara Hills Police) కేసు (Woman Harassment Case) దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Nov 15 , 2026 | 08:30 AM