వెలుగులోకి మరో ఫోక్ యాక్టర్ బాగోతం.. బయటపడ్డ వివాదం! ఆడియో కాల్ లీక్
ABN , Publish Date - Aug 23 , 2026 | 11:36 PM
ఈ మధ్యే ఫోక్ ఇండస్ట్రీ నుంచి ఈశ్వర్ సాయి అక్రమ సంబంధం ముగియకముందే ఫోక్ ఇండస్ట్రీలో మరో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఫోక్ ఇండస్ట్రీలో ఇటీవల వరుసగా వివాదాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈశ్వర్ సాయి అక్రమ సంబంధ వ్యవహారం ఇంకా చర్చనీయాంశంగా కొనసాగుతుండగానే తాజాగా మరో ఫోక్ ఆర్టిస్ట్‌కు సంబంధించిన వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
తాజాగా ఫోక్ కళాకారుడు కత్తెరపాక శ్రీనివాస్ (Katherapaka Srinivas)పై పలు ఆరోపణలు చేస్తూ వీడియోలు, పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో ఫోక్ డాన్సర్ శ్రీహర్ష (Sri Harsha) తో కలిసి దిగిన ఫోటోలను సేకరించి, వాటిని శ్రీహర్ష భర్తకు పంపుతా అంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ మేరకు వీరిరువు మాట్లాడుకున్న ఓ ఆడియో కాల్ సామాజిక మాధ్యమాల్లో విడుదలై వైరల్‌గా మారింది. ఈ ఆడియోలో శ్రీనివాస్ తన వద్ద ఉన్న ఫ్రూఫ్స్ నీ భర్తకు పంపిస్తా అని శ్రీ హర్షను బెదిరించడం స్పష్టంగా వినిపిస్తోంది. దానికి ప్రతిగా శ్రీ హర్ష మాట్లాడుతూ.. బ్లాక్ మెయిల్ చేయాలనకుంటున్నావా చేయ్.. వీడిజ్ఞోలు పంపివ్వు చూసుకుందాం. నా దగ్గర కూడా నీ ప్రూప్స్ ఉన్నాయి చూసుకుందాం ఎంతవరకు అయితే అంతవరకు అంటూ ఘాటుగానే రెస్పాండ్ అవడం ఈ ఆడియోలో ఉన్నాయి.
తాజాగా ఆ ఆడియో కాల్ బయటకు రావడంతో ఫోక్ ఇండస్ట్రీలో మరోసారి చర్చ మొదలైంది. కళాకారుల వ్యక్తిగత వ్యవహారాలు, పరస్పర ఆరోపణలు వరుసగా వెలుగులోకి రావడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఆరోపణలపై కత్తెరపాక శ్రీనివాస్ స్పందన ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియోలు, పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఆరోపణల నిజానిజాలపై స్పష్టత రావాల్సి ఉంది. సంబంధిత వ్యక్తుల నుంచి పూర్తి వివరాలు బయటకు వచ్చిన తర్వాతే అసలు విషయం ఏంటన్నది తేలే అవకాశం ఉంది.