విడిపోయిన.. నటి ఆకృతి, క్రికెటర్ పృథ్వీ షా

ABN , Publish Date - Sep 18 , 2026 | 09:53 AM

క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ తమ బంధానికి ముగింపు పలికారు. ఈ ఏడాది మార్చిలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట పెళ్లికి ముందే విడిపోయినట్లు ఆకృతి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

Prithvi Shaw

భారత యువ క్రికెటర్‌ పృథ్వీ షా, న‌టి ఆకృతి అగ‌ర్వాల్ జంట‌ మరోసారి వార్తల్లో నిలిచింది. మార్చిలో వీరిరువురు ఆడంబ‌రంగ‌గా చేసుకున్న‌ నిశ్చితార్థం రద్దయ్యింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆకృతి (Akriti Agarwal) ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టింది. మరోవైపు, ఆమె ఈ పోస్ట్‌ పెట్టిన కాసేపటికే పృథ్వీషా (Prithvi Shaw).. తన ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు మొత్తం పోస్టులను తొలగించడం గమనార్హం.

టాలీవుడ్ నటి ఆకృతి అగర్వాల్‌తో మార్చి 8న పృథ్వీ షా ఎంగేజ్‌మెంట్ (Prithvi Shaw Engagement) జరిగింది. అందుకు సంబంధించిన ఫొటోలు వీరిద్దరూ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. అయితే, ఈ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు తాజాగా ఆకృతి ప్రకటించింది. ‘భవిష్యత్తుకు సంబంధించి మా ఇద్దరి లక్ష్యాలు, పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయి.

మాకు ఒకరిమీద ఒకరికి ప్రేమ ఉన్నప్పటికీ.. మా దారులు వేరని, ఇక కలిసి ప్రయాణించలేమని అర్థమైంది. బాధ్యతలు, మా చుట్టూ ఉన్న పరిస్థితుల దృష్ట్యా మేం విడి విడిగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఈ సమయంలో మా గోప్యతను అందరూ గౌరవించాలని ఆకాంక్షిస్తున్నా. మా నిర్ణయం వెనుక ఎలాంటి ఊహాగానాలు, అసత్య ప్రచారాలు చేయొద్దని కోరుతున్నా’ అని ఆకృతి అగర్వాల్‌ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.

ఈమె ప్రకటన వెలువడిన కాసేపటికే.. పృథ్వీ షా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులన్నీ అదృశ్యమయ్యాయి. ఒక్క 2016 నాటి పోస్ట్‌ మినహా అన్నింటినీ తొలగించాడు. ‘నిన్ను నువ్వు పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేనంత వరకు పని చేయి’ అనే అర్థంతో ఉన్న పోస్ట్‌ మాత్రమే ఉంచాడు. అయితే, నిశ్చితార్థం రద్దు గురించి మాత్రం పృథ్వీషా ఇంకా స్పందించలేదు.

ఈ ఏడాది జులైలో వీరి బ్రేకప్‌ గురించి వార్తలు వచ్చాయి. ‘నేను మోసపోయా. అతడితో కలిసి జీవితంలో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాక ఇదంతా నమ్మలేకపోతున్నా. అతడి గురించి సామాజిక మాధ్యమాల్లో చూసిందంతా నిజమే. వదంతులన్నీ వాస్తవమే’ అంటూ ఆ మధ్య ఆకృతి ఓ పోస్ట్‌ చేసింది. అందులో పృథ్వీషా పేరును ఆమె ప్రస్తావించనప్పటికీ.. వీరిద్దరి మధ్య బ్రేకప్‌ జరిగినట్లు ప్రచారం జరిగింది.

అయితే, నాడు ఆ వార్తలను ఆకృతి ఖండించింది. తన స్నేహితులను ఉద్దేశించే ఆ పోస్ట్‌ చేశానని, కాబోయే భర్తతో తాను చాలా సంతోషంగా ఉన్నానని నాడు ఆమె చెప్పింది. ఇప్పుడు రెండు నెలలు తిరగకుండానే.. నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఆమె ప్రకటించడం గమనార్హం. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా పాపులర్‌ అయిన ఆకృతి.. ఈ ఏడాది విడుదలైన ‘త్రిముఖ’ అనే తెలుగు సినిమాలో నటించింది.

ఇదిలాఉంటే.. ఫిట్‌నెస్ స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌వుతున్న పృథ్వీ షా పూర్తిగా అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల‌కు దూరం కాగా ప్ర‌స్తుతం దేశ‌వాళీ పోటీల‌కు మాత్ర‌మే ప‌రిమ‌తమ‌య్యాడు.

Updated Date - Sep 18 , 2026 | 10:29 AM