ధురంధర్-2 ప్రదర్శనలో గందరగోళం! ఒకదానికి బదులు మరో సినిమా.. మాల్‌లో ప్రేక్షకుల ఆందోళన
ABN , Publish Date - Mar 23 , 2026 | 07:54 AM
రణవీర్ సింగ్ నటించిన దురంధర్-2 సినిమా ప్రదర్శన విడుదల సందర్భంగా గందరగోళం నెలకొంది.
రణవీర్ సింగ్ (Ranveer Singh) నటించిన దురంధర్-2 (Dhurandhar The Revenge) సినిమా ప్రదర్శన విడుదల సందర్భంగా గందరగోళం నెలకొంది. తెలుగు వెర్షన్ కోసం టికెట్ బుక్ చేసుకుంటే హిందీ వెర్షన్‌లో సినిమా నడుస్తుండడంతో ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రెండు రోజుల క్రితం ధురంధర్-2 సినిమా విడుదల అయింది. ఆన్లైన్‌లో తెలుగు వెర్షన్న్‌కి కూడా బుకింగ్స్ ఓపెన్ చేయడంతో చాలామంది టికెట్లు బుక్ చేసుకున్నారు.
ఎర్రమంజిల్ (Irrum Manzil) పీవీఆర్ నెక్స్ట్ గలేరియా మాల్‌లో ( PVR Next Galleria Mall) హిందీ వెర్షన్ ప్రదర్శించడంతో తెలుగు వెర్షన్ టికెట్లు తీసుకున్న వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనుకున్న సమయానికి ప్లే చేయక పోవడంతో ఆందోళనకు దిగారు. పంజాగుట్ట పోలీసులు ప్రేక్షకులను సముదాయించారు. గంట ఆలస్యంగా తెలుగు వెర్షన్ సినిమా ప్రారంభం కావడంతో ప్రేక్షకులు శాంతించారు.