గద్దర్ అవార్డ్స్‌లో సత్తా చాటిన బన్నీ వాస్ సినిమాలు!
ABN , Publish Date - Mar 21 , 2026 | 10:03 AM
బన్నీ వాస్ తాను నిర్మించి, పంపిణీ చేసిన చిత్రాలు ప్రేక్షకుల రివార్డులతో పాటు ప్రభుత్వ అవార్డులు అందుకోవడం పట్ల హర్షం వెలిబుచ్చారు. ఈ ప్రోత్సాహంతో మరిన్ని మంచి సినిమాలు నిర్మిస్తానని చెబుతున్నారు.
ప్రభుత్వ అవార్డులు అందుకునే సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్ సాధించవనే అపోహ మొన్నటి వరకూ ఉండేది. అయితే ఇప్పుడు ప్రభుత్వాలు సైతం కమర్షియల్ సక్సెస్ అయిన సినిమాలనూ అవార్డులతో ప్రోత్సహిస్తున్నాయి. దాంతో నిర్మాతగా మంచి వ్యాల్యూస్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రాలను నిర్మిస్తూ, డిస్ట్రిబ్యూట్ చేస్తూ ప్రేక్షకుల రివార్డ్స్, అవార్డ్స్ సొంతం చేసుకుంటున్నారు ప్రొడ్యూసర్ బన్నీ వాస్ (Bunny Vas). ఆయన ఇటీవల నిర్మించిన, డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ బరిలో విజయం సాధించంతో పాటు పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు గెల్చుకోవడం విశేషం.
బన్నీ వాస్ నిర్మించిన 'ఆయ్' (Aay) సినిమా హోల్‌సమ్ ఎంటర్ టైనర్‌గా గతేడాది గద్దర్ అవార్డ్‌ను గెల్చుకుంది. ఈ ఏడాది 'తండేల్' (Thandel) సినిమా ఉత్తమ నటుడు, ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా రెండు గద్దర్ అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (Naga Chaitanya) గద్దర్ అవార్డ్ గెల్చుకున్నారు. బన్నీ వాస్ డిస్ట్రిబ్యూట్ చేసిన 'లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి' సినిమాలు ఈ యేడాది గద్దర్ అవార్డ్స్‌లో సత్తాచాటాయి. ప్రేక్షకులు ఇచ్చిన సపోర్ట్‌తో పాటు ఈ అవార్డ్స్ అందించే ప్రోత్సాహంతో మరిన్ని మంచి ప్రాజెక్ట్స్ చేస్తానని బన్నీ వాసు చెబుతున్నారు.