బిగ్‌బాస్ ఫేమ్ నూతన్ నాయుడికి అరుదైన అంతర్జాతీయ గౌరవం

ABN , Publish Date - Jun 24 , 2026 | 01:15 PM

బిగ్‌బాస్ ఫేమ్ నూతన్ నాయుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.

nutan

గ‌తంలో బిగ్‌బాస్ (Bigg Boss) షోతో రెండు తెలుగు రాష్ట్రాల‌కు సుప‌రిచిత‌మైన‌ నూతన్ నాయుడు (Nuthan Naidu) మ‌రో అరుదైన ఘ‌న‌త ఆధించారు. అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థగా పేర్కొనబడే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ పీస్ కౌన్సిల్ (United Nations International Peace Council) ఆయనకు ‘Sir’, ‘His Excellency’ బిరుదులను ప్రదానం చేసింది. సామాజిక, మేధో, శాంతి సంబంధిత అంశాలపై ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ గౌరవాలు అందించినట్లు వెల్లడించారు.

విద్యా రంగంలో నూతన్ నాయుడు ప్రత్యేక గుర్తింపు పొందారు. దేశీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖ విద్యాసంస్థలతో ఆయనకు అనుబంధం ఉన్నట్లు పేర్కొనబడింది. మేనేజ్‌మెంట్, రాజ్యాంగ అంశాలు, ప్రజా విధానాలపై ఆయనకు ఉన్న అవగాహనతో పలు రంగాల్లో తనదైన ముద్ర వేశారు. రాజకీయ వ్యూహాల రూపకల్పనలో కూడా నూతన్ నాయుడు పాత్రపై గతంలో చర్చ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడిన పలు రాజకీయ పార్టీల ఆలోచనా ప్రక్రియలో ఆయన సూచనలు, సలహాలు కీలకంగా నిలిచినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.

nutan.jfif

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఎన్నికల వ్యూహాల రూపకల్పనలో కూడా నూతన్ నాయుడు ప్రత్యేక నైపుణ్యం కనబరిచినట్లు ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. విద్యా, సామాజిక రంగాల్లో తన సేవలను మరింత విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ఆయన తెలిపారు. తన తండ్రి సన్యాసిరావు నాయుడు ఆశయాలను కొనసాగిస్తూ ప్రపంచ శాంతి, సామాజిక అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తానని నూతన్ నాయుడు ఈ సందర్భంగా వెల్లడించారు.

Updated Date - Jun 24 , 2026 | 06:11 PM