మాలాధారుల కోసం కొత్త భక్తి గీతం.. ‘అయ్యప్ప మా అయ్యప్ప’ ఆవిష్కరణ

ABN , Publish Date - Nov 26 , 2026 | 07:42 AM

అయ్యప్ప మాలాధారులు భక్తి భావంతో పాడుకునేలా పర్ణశాల సంస్థ రూపొందించిన ‘అయ్యప్ప మా అయ్యప్ప’ భక్తి గీతాన్ని తలసాని సాయికిరణ్ యాదవ్ ఆవిష్కరించారు.

Ayyappa Devotional Song

అయ్యప్ప స్వామి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచేలా, అయ్యప్ప మాలాధారులు భక్తి భావంతో పాడుకునేలా రూపొందించిన ‘అయ్యప్ప మా అయ్యప్ప’ (Ayyappa Maa Ayyappa) భక్తి గీతాన్ని బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్ (Talasani Sai Kiran Yadav) ఆవిష్కరించారు. అయ్యప్ప మాలాధారులు భక్తి భావంతో పాడుకునేలా ఈ గీతాన్ని రూపొందించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. అయ్యప్ప స్వామిపై భక్తిని చాటే ఈ పాట భక్తుల్లో ఆధ్యాత్మిక భావనను మరింత పెంపొందిస్తుందని ఆకాంక్షించారు.

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న తన నివాసంలో ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. పర్ణశాల సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ భక్తి గీతాన్ని నిర్మాత సతీష్ రెడ్డి, రచయిత్రి నందిని, ఇతర చిత్ర బృందం సభ్యులతో కలిసి తలసాని సాయికిరణ్ యాదవ్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా పాట‌ రూపకల్పనలో భాగస్వాములైన నిర్మాత, రచయిత్రి, చిత్ర బృందం సభ్యులను ఆయన అభినందించారు. అయ్యప్ప స్వామి భక్తులకు ఈ పాట నచ్చుతుందని, మాలాధారణ సమయంలోనూ, భజన కార్యక్రమాల్లోనూ భక్తులు ఆలపించేలా గీతాన్ని రూపొందించడం విశేషమని పేర్కొన్నారు.

Updated Date - Nov 26 , 2026 | 07:42 AM