నటి కాదంబరి కథలో.. మరో కోణం! డబ్బు కోసం.. బ్లాక్ మెయిల్ చేసిన జెత్వానీ!

ABN , Publish Date - Jul 20 , 2026 | 06:44 AM

ముంబై మోడల్/నటి కాదంబరి జెత్వానీ, వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్ ను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి రూ.కోట్లు వసూలు చేసినట్లు సీఐడీ ఆరోపించింది.

Kadambari Jatwani

ముంబై మోడల్/నటి కాదంబరి జెత్వానీ (Kadambari Jatwani), వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్ (Kuukkala Vidyasagar)ను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి రూ.కోట్లు వసూలు చేసినట్లు సీఐడీ ఆరోపించింది. ఈ మేరకు కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. విద్యాసాగర్ ఫిర్యాదుతో క్రిమినల్ కుట్ర, బలవంతపు వసూళ్లు (ఎక్స్టెర్షన్), మోసం, పోర్టరీ, బెదిరింపుల ఆరోపణలతో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లో 2024 ఫిబ్రవరి 2న ఈ కేసు నమోదైంది. దీనిపై దర్యాప్తు చేపట్టిన సీఐడీ. విజయవాడ నాలుగో అదనపు మేజిస్ట్రేట్ కోర్టుకు చార్జిషీటు సమర్పించింది.

'గుజరాత్‌కు చెందిన కాదంబరి నరేంద్ర కుమార్ జెత్వాస్ 2009లో మిస్ గుజరాత్ కిరీటాన్ని గెలుచుకుంది. సినిమాల్లో నటించేందుకు ముంబైకి చేరిన ఆమె అక్కడ ఒక ప్రైవేటు కార్యక్రమంలో కుక్కల విద్యాసాగర్‌కు పరిచయమైంది. తన పేరు నటాషా అని, మొబైల్ ఫోన్ పోయిందంటూ జెత్వానీ మాటలు కలిపారు. తాను వైద్య విద్యార్థిని అని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని తెలిపారు. తర్వాత ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడడంతో హోటల్‌కు వెళ్లారు. సన్నిహితంగా ఉన్నప్పుడు ఫొటోలు తీసి, ఆయన్ను బ్లాక్ మెయిల్ చేశారు. 2013 మే 14న రూ.లక్ష 2015 అక్టోబరులో రూ.50 వేలు, 2015 మార్చి, ఏప్రిల్లో రూ.4.20 లక్షలు, 2018లో రూ.లక్ష, 2023లో మరో లక్షన్నర. విడతలవారీగా విద్యాసాగర్ ఆమెకు చెల్లించారు' అని అందులో పేర్కొంది..

అయితే 2023 సెప్టెంబరు నుంచి నవంబరు మధ్య ఆర్ట్ గ్యాలరీ పేరిట రూ.కోటి ఇవ్వాలన్న డిమాండ్‌తో బెదిరింపులను జెత్వానీ తీవ్రతరం చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు కాల్ డేటా, బ్యాంకు లావాదేవీల రికార్డులు, ఇతర ఎలక్ట్రానిక్ ఆధారాలను సీఐడీ కోర్టుకు సమర్పించింది. అయితే ఫిర్యాదు దారు ఆరోపించినట్లుగా రూ.1.32 కోట్లు ఆమె వసూలు చేశారనడానికి అన్ని ఆధారాలూ లభించలేదని తెలిపింది. అలాగే ఆమె కుటుంబ సభ్యుల పాత్రపై ఆధారాలు ఇంకా లభించలేదని సీఐడీ పేర్కొంది. జెత్వానీ ఆరెస్టు సమయంలో స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, ఇతర పరికరాల ఫోరెన్సిక్ పరీక్షలు ఇంకా పూర్తి కాలేదని దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఫోరెన్సిక్ నివేదిక అందిన తర్వాత అవసరమైతే బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 19369) ప్రకారం మరింత లోతుగా దర్యాప్తు చేసి అదనపు అభియోగ పత్రం దాఖలు చేసేందుకు కోర్టును అనుమతి కోరింది.

Updated Date - Jul 20 , 2026 | 06:44 AM