అనిరుధ్ రవిచందర్ – కావ్య మారన్ రిసెప్షన్‌కు లోకేశ్ దంపతులు.. రజనీకాంత్‌తో ప్రత్యేక భేటీ!
ABN , Publish Date - Nov 22 , 2026 | 06:57 AM
చెన్నైలో జరిగిన అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు ఏపీ మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్స్ హాజరయ్యారు.
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander), సన్ రైజర్స్ టీం సీఈవో కావ్య మారన్ (Kaviya Maran) వివాహ రిసెప్షన్ (Anirudh Ravichander) వేడుక చెన్నైలో శనివారంఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఏపీ మంత్రి లోకేశ్ (Nara Lokesh), బ్రాహ్మణి (Brahmani) దంపతులు, తనయుడు దేవాన్స్ హాజరయ్యారు. నూతన వధూవరులకు ఆశీర్వదించారు.
రిసెప్షన్‌కు విచ్చేసిన తమిళ నాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్, మంత్రి ఉదయనిధి స్టాలిన్లను లోకేశ్ మర్యాద పూర్వకంగా కలిశారు. రజనీకాంత్ (Rajinikanth) ఆప్యాయంగా లోకేశ్‌తో ముచ్చటించారు. అటు రాజ్యసభ ఎంపీ, డీఎండీకే పార్టీ నేత ఎల్ కే సుధీశ్, ఎల్కిఎస్ గ్రూపు ఆఫ్ కంపెనీస్ ఎండీ పూర్ణ జ్యోతి దంపతుల కుమార్తె వివాహ రిసెప్షన్‌కు కూడా లోకేశ్ హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు.