కొత్త బిజినెస్‌లోకి యాంకర్‌ శ్రీముఖి..

ABN , Publish Date - Mar 25 , 2026 | 11:16 PM

యాంకర్‌గా బుల్లితెరపై, నటిగా వెండితెరపై దూసుకుపోతున్న శ్రీముఖి (Srimukhi) ఇప్పుడు మరో రంగంలోకి అడుగుపెడుతుంది.

యాంకర్‌గా బుల్లితెరపై, నటిగా వెండితెరపై దూసుకుపోతున్న శ్రీముఖి (Srimukhi) ఇప్పుడు మరో రంగంలోకి అడుగుపెడుతుంది. ఆమె ఫుడ్‌ అండ్‌ హాస్పిటాలిటీ రంగంలోకి దిగారు. శ్రావణ్‌, ఆనంద్‌, రవితో కలిసి పుర్సత్‌ పేరుతో మాదాపూర్‌ క్యాపిటల్‌ పార్క్‌లో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీముఖి మాట్లాడుతూ 'నాకు భోజనం అంటే చాలా ఇష్టం. వెజిటేరియన్‌ ఐటెమ్స్‌తోపాటు, చికెన్‌ ఐటెమ్స్‌, బిర్యాని, మన ఇంటి స్టైల్‌ కర్రీస్‌ అంటే చాలా ఇష్టం. ఫుర్సత్‌లో ప్రతి ఒక్కరికీ కొత్త రుచుల్ని అందిస్తాం. ఇది రెస్టారెంట్‌ మాత్రమే కాదు.. గొప్ప అనుభూతి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో వచ్చి రిలాక్స్‌ అవ్వడానికి ఇది మంచి ప్రదేశం. సామాన్యులకు సైతం అందుబాటులో ధరలు, ప్రత్యేక వంటకాలు, నల్లి ఘోష్‌ బిర్యానీ మా ప్రత్యేకత. సుమారు 300 మంది కూర్చునే సదుపాయంతో విశాలమైన బ్యాంకెట్‌ హాల్‌ సౌకర్యం ఉంది’ అన్నారు.
'sri.jpeg


శ్రీముఖి పార్టనర్‌ శ్రావణ్‌ మాట్లాడుతూ 'భోజన ప్రియుల కోసం చక్కని వాతావరణం.. మన ఇంటి రుచులతో ఈ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశాం. శ్రీముఖి పార్టనర్‌షిప్‌ ఈ బ్రాండ్‌ను మరింత ముందుకు తీసుకెళ్తుందని నమ్ముతున్నాం ’ అన్నారు.

Updated Date - Mar 26 , 2026 | 12:14 AM