తెలుగులో తొలి ఏఐ ఫీచర్ ఫిల్మ్‌ 'అంబ’s రివెంజ్'

ABN , Publish Date - Apr 02 , 2026 | 02:19 PM

ఏఐతో తెరకెక్కుతున్న తొలి తెలుగు సినిమా ‘అంబ’s రివెంజ్’ – ఇది మహాభారత కథకు మోడర్న్ టచ్.

తెలుగు చలనచిత్ర రంగంలో సరికొత్త దిశగా అడుగులు పడుతున్నాయి. పూర్తిస్థాయి కృత్రిమ మేధ (AI) ఆధారంగా తెరకెక్కుతున్న తొలి తెలుగు ఫీచర్ ఫిల్మ్‌గా అంబ’s రివెంజ్ ప్రత్యేక గుర్తింపు దక్కించుకోబోతోంది. సాంకేతిక విప్లవానికి నాంది పలికే ఈ ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో ఓ ఆసక్తికర చర్చ మొదలైంది. హనుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా ఇప్ప‌టికే విడుదలైన టైటిల్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. విజువల్స్‌ నుంచే ఈ సినిమా ప్రత్యేకత స్పష్టమవుతోంది.

WhatsApp Image 2026-04-02 at 2.14.56 PM.jpeg

మహాభారతంలోని శక్తివంతమైన పాత్ర అంబ కథను ఆధారంగా తీసుకుని, పౌరాణిక అంశాలను ఆధునిక టెక్నాలజీతో మేళవిస్తూ ఈ చిత్రాన్ని విభిన్నంగా మలుస్తున్నారు. యోగేంద్ర పొట్లూరి నిర్మాణం, రాణి మాడిసన్ సహ నిర్మాణంలో నక్క తోక ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నాయి. జయవర్ధన్ మాడి క్రియేటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

WhatsApp Image 2026-04-02 at 2.14.58 PM.jpeg

ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ కోసం అత్యాధునిక AI టూల్స్ వినియోగిస్తున్నామని వెల్లడించింది. పాత్రల డిజైన్, విజువల్ క్రియేషన్, కథనం రూపకల్పన వంటి విభాగాల్లో కొత్త తరహా ప్రయోగాలు చేస్తున్నామని తెలిపింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - Jul 07 , 2026 | 09:35 AM