అల్లు ఫ్యాన్స్ గొప్ప నిర్ణయం.. హెచ్‌పీవీ వ్యాక్సిన్ డ్రైవ్‌కు మద్దతు
ABN , Publish Date - Apr 01 , 2026 | 12:47 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమాన సంఘం (AAFA) మరోసారి సామాజిక బాధ్యతను చాటుకుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అభిమాన సంఘం (AAFA) మరోసారి సామాజిక బాధ్యతను చాటుకుంది. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ ముందుకొచ్చింది. ఈ ఏడాది మొత్తం వివిధ కార్యక్రమాల ద్వారా హెచ్‌పీవీ టీకా ప్రాముఖ్యతను ప్రజలకు చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రతి ఏడాది ఒక మంచి పని చేయాలన్న అల్లు అర్జున్ సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని AAFA ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా బాలికలు, మహిళల్లో కనిపించే సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించడంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ కీలక పాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
9 నుంచి 26 ఏళ్ల మధ్య వయసున్న బాలికలు, యువతులు ఈ టీకాను తీసుకోవాలని సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందుబాటులో ఉంది.
అల్లు అర్జున్ జన్మదినం సందర్భంగా ఇలాంటి ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం అభిమాన సంఘం తీసుకున్న మంచి నిర్ణయంగా అభినందనలు అందుకుంటోంది. సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. మున్మందు ఆలాంటి కార్యక్రమాలను కంటిన్యూ చేయాలని ఆకాంక్షిస్తున్నారు.