అవతార్ డైరెక్టర్ జేమ్స్ కేమరాన్ పై కేసు.. వాటిని దొంగిలించాడంటూ నటి ఫైర్

ABN , Publish Date - May 09 , 2026 | 04:23 PM

ప్రఖ్యాత హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కేమరాన్ (James Cameron)పై కేసు నమోదయ్యింది అంటేనే అదో ఆసక్తికరమైన అంశం. తన చిత్రాలతో యావత్ ప్రపంచ సినీ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకున్న జేమ్స్ కేమరాన్ పై అమెరికా నటి కొరియెంకా కిల్చర్ ( Q'orianka Kilcher) కోర్టులో కేసు వేసింది.

James Cameron

ప్రఖ్యాత హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కేమరాన్ (James Cameron)పై కేసు నమోదయ్యింది అంటేనే అదో ఆసక్తికరమైన అంశం. తన చిత్రాలతో యావత్ ప్రపంచ సినీ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకున్న జేమ్స్ కేమరాన్ పై అమెరికా నటి కొరియెంకా కిల్చర్ ( Q'orianka Kilcher) కోర్టులో కేసు వేసింది. తన అనుమతి లేకుండానే తన ఫొటోలు, వీడియోస్ ఆధారంగా 'ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్'ను కేమరాన్ దొంగిలించాడని కొరియెంకా ఆరోపించింది. కేమరాన్ రూపొందించిన 'అవతార్' సిరీస్ లోని మూడో భాగం 'ఫైర్ అండ్ యాష్'లో నేతిరి పాత్రకు తన 'ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్'ను దొంగిలించి వాడుకున్నారని కొరియెంకా కోర్టుకెక్కింది. ఈ నేపథ్యంలో జేమ్స్ కేమరాన్, ఆ మూవీని విడుదల చేసిన 'ట్వంటీయెత్ సెంచరీ' సంస్థ పైనా కేసు ఫైల్ చేసింది.


ఆమె వాదన ప్రకారం, తాను 2005లో నటించిన ది న్యూ వరల్డ్ చిత్రంలోని ఫోటోలను ఆధారంగా తీసుకుని నేతిరి పాత్ర డిజైన్ చేశారని, కానీ తనకు ఎలాంటి క్రెడిట్ లేదా పరిహారం ఇవ్వలేదని తెలిపింది. ఒకరి అనుమతి లేకుండా వారికి సంబంధించిన వస్తువులను ఉపయోగించుకోవడమే నేరం!. అలాంటిది నటీనటుల హావభావాలను వారి పర్మిషన్ తీసుకోకుండా వినియోగించుకుంటే క్రైమ్ కాక ఏమవుతుందని, కొరియెంకాకు నష్టపరిహారం చెల్లించాల్సిందే అంటూ ఆమె లాయర్స్ కూడా వాదిస్తున్నారు.


కొరియెంకా విషయానికి వస్తే స్వయంగా జేమ్స్ కేమరాన్ ఆమెతో తన 'నేతిరి' పాత్రకు ఇన్ స్పిరేషన్ నువ్వే అని చెప్పారు. అంతేకాదు ఏ పిక్స్, వీడియోస్ చూసి తాను 'నేతిరి'ఫేసియల్ ఎక్స్ ప్రెషన్స్ క్రియేట్ చేసిన సంగతీ తెలిపారు. మరి అప్పుడే కొరియెంకా ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నది జేమ్స్ ఫ్యాన్స్ మాట!. మరి జేమ్స్ పై కొరియెంకా కేసు ద్వారా ఆమెకు ఎలాంటి లబ్ధి చేకూరుతుందో కానీ, ఈ వివాదం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఓ అలర్ట్ మొదలయ్యింది. అందువల్ల మేకర్స్ తాము ఏ 'రీ-క్రియేషన్' చేయాలనుకున్నా, ముందుగా సంబంధిత వ్యక్తుల అనుమతి తీసుకోవడం అత్యుత్తమం. ఈ రూటులో ఎంతమంది సినీజనం సాగుతారో చూడాలి.

Updated Date - May 09 , 2026 | 04:37 PM