రాక్ వ‌చ్చేశాడు.. కొత్త జుమాంజీ మూవీ ట్రైల‌ర్ అదిరింది

ABN , Publish Date - Jul 29 , 2026 | 04:10 PM

హాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన అడ్వెంచర్ ఫ్రాంచైజీల్లో 'జుమాంజి' ఒకటి.

Jumanji

హాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన అడ్వెంచర్ ఫ్రాంచైజీల్లో 'జుమాంజి' ఒకటి. ఇప్పుడు ఈ సిరీస్‌లో కొత్త సినిమా జుమాంజీ ఓపెన్ వ‌ర‌ల్డ్ (JUMANJI: OPEN WORLD) విడుద‌ల‌కు రెడీ అయింది. ఈ నేప‌థ్యంలో తాజాగా విడుద‌ల చేసిన ట్రైల‌ర్ అభిమానుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. యాక్షన్, కామెడీ, ఫాంటసీ కలయికలో రూపొందిన ఈ చిత్రంపై అంచ‌నాలు మ‌రింత‌గా రెట్టింపు అయ్యాయి.

తాజాగా రిలీజ్ అయిన ట్రైల‌ర్ చూస్తే.. చాలా విభిన్నంగా, ఆక‌ర్ష‌ణీయంగా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు జుమాంజీ సినిమాల‌లో న‌లుగైదురు క‌లిసి గుమాంజీ గేమ్ ఆడడం దాంతో వారంతా గేమ్‌లోకి వెళ్లి వినూత్న శ‌క్తుల‌తో ఓ ర‌హ‌స్య ప్రంప‌చంలో సాహ‌స కృత్యాలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు రాబోతున్న చిత్రంలో క‌థ ఇందుకు పూర్తి విభిన్నంగా ఉంది. ఈ మారు జుమాంజీ ప్ర‌పంచ‌మే నిజ జీవితంలోకి వ‌చ్చేస్తుంది. ఆ ప్ర‌పంచంలోని పాత్ర‌లు, యానిమ‌ల్స్ అన్నీ భూమీ పైకి వ‌చ్చి విద్వంసం సృష్టిస్తుంటాయి. ఈ నేప‌థ్యంలో గేమ్‌లోని పిత్ర‌లు, రియ‌ల్ పాత్ర‌లు వాటిని ఎలా అదుపులోకి తీసుకు వ‌చ్చారు. ఆ గంద‌ర‌గోళాన్ని ఎలా ఆపగ‌లిగార‌నేదే స్టోరీగా తెలుస్తోంది..

గ‌త జుమాంజీ సినిమాలో న‌టించిన పాత్ర‌ధారులు డ్వేన్ జాన్సన్ (The Rock), కెవిన్ హార్ట్,జాక్ బ్లాక్, కరెన్ గిల్లన్, నిక్ జోనాస్, డ్యానీ డివిటో, అక్వాఫినా ఇందులోనూ న‌టిస్తుండ‌డం విశేషం. వీరి మధ్య వచ్చే కామెడీ, భారీ యాక్షన్ సన్నివేశాలు ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. గత రెండు చిత్రాల మాదిరిగానే హాస్యానికి పెద్దపీట వేస్తూనే భారీ అడ్వెంచర్‌ను చూపించనున్నట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. కాగా సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - Jul 29 , 2026 | 04:10 PM