The End of Oak Street: కాల‌నీ మొత్తం స‌డ‌న్‌గా .. డైనోసార్స్ ప్లేస్‌లోకి మారిపోతే! ట్రైల‌ర్ అదిరింది

ABN , Publish Date - Jun 01 , 2026 | 10:10 PM

చాలా రోజుల త‌ర్వాత ప్ర‌పంచ వ్యాప్తంగా సినీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు ఓ అమెరిక‌న్ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు ముస్తాబ‌యింది.

The End of Oak Street

చాలా రోజుల త‌ర్వాత ప్ర‌పంచ వ్యాప్తంగా సినీ ప్రేఎకుల‌ను అల‌రించేందుకు ఓ అమెరిక‌న్ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు ముస్తాబ‌యింది. అన్నే హాత్వే (Anne Hathaway), ఇవాన్ మెక్‌గ్రెగర్ (Ewan McGregor), మైసీ స్టెల్లా (Maisy Stella), క్రిస్టియన్ కన్వెరీ (Christian Convery) కాంబోలో తెర‌కెక్కిన హాలీవుడ్ చిత్రం ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్ (The End of Oak Street). సైన్స్ ఫిక్స‌న్ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ చిత్రానికి డేవిడ్ రాబర్ట్ మిచెల్ (David Robert Mitchell) ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ఆగ‌స్టులో ప్రేక్ష‌కుల ఎదుట‌కు రానుంది. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

ఓ కాస్మిక్ దుర్ఘ‌ట‌న త‌ర్వాత ఓక్ స్ట్రీట్ ఏరియా అంతా అనుకోకుండా మిస్ట‌రీగా భారీ డైనోసార్స్ ఉండే ప్రాంతంలోకి వ‌చ్చి ప‌డుతుంది. ఈ విష‌యం అక్క‌డి వారు అంత‌గా గుర్తించ‌రు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి హ్యాపీగా ఉన్న‌ ఫ్యామిలీ ఈ మార్పును గ‌మ‌నించే స‌మ‌యానికి డైనోసార్స్‌ దాడి చేయ‌డం ప్రారంభిస్తాయి. ఈ క్ర‌మంలో వారు డైనోసార్స్ నుంచి ఎలా త‌ప్పించుకున్నారనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నంతో ఓళ్లు గ‌గుర్పిడొచే పోరాట స‌న్నివేశాలు, విజువ‌ల్ వండ‌ర్‌గా సినిమాను తీర్చిదిద్దిన‌ట్లు తెలుస్తోంది. ఇంకా ఆల‌స్యం ఎందుకు ఇప్పుడే ట్రైల‌ర్ చూసేయండి.

Updated Date - Jun 01 , 2026 | 10:10 PM