Michael: టార్గెట్ 10 వేల కోట్లు! మైఖేల్ జాక్సన్ బయోపిక్ ట్రైలర్ వచ్చేసింది
ABN , Publish Date - Feb 04 , 2026 | 11:06 AM
మూడు దశాబ్దాల పాటు తన ఆట, పాటలతో ప్రపంచాన్ని అలరించిన కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది.
మూడు దశాబ్దాల పాటు తన ఆట, పాటలతో ప్రపంచాన్ని అలరించిన కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్. ఆయన మరణించి 15 సంవత్సరాలు దాటినా.. ఆయన మ్యూజిక్‌ను కోట్లాది మంది అభిమానులు ఆస్వాదిస్తూనే ఉన్నారు. అంతటి లెజెండ్ ప్రస్థానాన్ని ప్రముఖ దర్శకుడు ఆంటోనీ పుక్వా ‘మైఖేల్’ (Michael) పేరుతో సినిమాగా తెరకెక్కిస్తున్నారు. లయన్స్ గేట్, జీకే ఫిల్మ్స్ సంస్థలు దీనిని నిర్మిస్తున్నాయి.
ఇందులో మైఖేల్ జాక్సన్ పాత్రను ఆయన మేనల్లుడు జాఫర్ జాక్సన్ (Jaafar Jackson) పోషిస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. మైఖేల్ జాక్సన్ సాధించిన విజయాలతో పాటు ఆయన వ్యక్తిగత జీవితంలోని పోరాటాలను కూడా ట్రైలర్‌లో చూపించారు.
ఒక సామాన్య బాలుడు గ్లోబల్ ఐకాన్‌గా ఎలా ఎదిగాడన్నది ఈ చిత్రంలో ప్రధాన కథాంశం. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. దీంతో సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గ్లోబల్ బాక్సాఫీసు వద్ద పది వేల కోట్ల రూపాయలు రాబట్టవచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.