Sydney Sweeney: హాలీవుడ్ బోర్డుపై బ్రా ప్రమోషన్స్.. నటిపై క్రిమినల్ కేసు

ABN , Publish Date - Jan 27 , 2026 | 08:02 PM

వ్యాపారం బాగా జరగాలి అంటే ప్రచారం బాగా చేయాలి. ఒక వస్తువును అమ్మాలంటే.. ముందు దాని గురించి ప్రజలకు తెలిసేలా చేయాలి

Sydney Sweeney

Sydney Sweeney: వ్యాపారం బాగా జరగాలి అంటే ప్రచారం బాగా చేయాలి. ఒక వస్తువును అమ్మాలంటే.. ముందు దాని గురించి ప్రజలకు తెలిసేలా చేయాలి. ఈ ప్రచారాలు వింతగా అయినా ఉండాలి లేదా వివాదంగా అయినా మారాలి. అప్పుడే అందరూ ఆ వస్తువుపై ఫోకస్ పెడతారు. అందులో రెండోదారిని ఎంచుకుంది హాలీవుడ్ నటి సిడ్నీ స్వీనీ (Sydney Sweeney). 28 ఏళ్ళ ఈ అమెరికన్ నటి మంచి హిట్ సినిమాల్లోనే నటించింది. యుఫోరియా, ది హౌస్ మెయిడ్, ఎవ్రీథింగ్ సక్స్ వంటి సినిమాలతో సిడ్నీ చాలా మంచి గుర్తింపును తెచ్చుకుంది.

ఇక సిడ్నీ ఈ మధ్యే లో దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించింది. తన లో దుస్తుల బ్రాండ్ ని ప్రమోట్ చేయడం కోసం ఆమె ఒక వినూత్న ప్రయత్నం చేసింది. అదేంటంటే.. లాస్ ఏంజెలిస్ లో ఉండే ప్రఖ్యాత హాలీవుడ్‌ బోర్డ్‌ పై తన బ్రాండ్ బ్రాలను దండగా మార్చి ఆ అక్షరాలపై వేసింది. దానికోసం తన టీమ్ తో కలిసి అర్ధరాత్రి ఆమె పెద్ద సాహసమే చేసింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లో దుస్తులను కుప్పలుగా పోసి.. వాటిని ఒక దండగా చేసి హాలీవుడ్ బోర్డుపై వేస్తూ కనిపించింది. ఇలా చేసి తన బ్రాండ్ ని అందరికీ పరిచయం చేయాలని అనుకుంది. కానీ, ఆమె ఈ పని చేసినందుకు విమర్శలను ఎదుర్కొంటోంది.

సిడ్నీ స్వీనీ చేసిన ఈ పనిపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పాపులారిటీ కోసమే ఆమె ఈ పని చేసిందని , హాలీవుడ్ పరువు తీసిందని, వెంటనే సిడ్నీ స్వీనీని అరెస్ట్ చేయాలనీ కోరుతున్నారు. ఇంకోపక్క ఈ వీడియో ద్వారా నటికి మంచే జరిగిందని కొందరు అంటున్నారు. ఇప్పటివరకు చాలామందికి తెలియని ఆమె ఒక్క వీడియోతో అందరికీ తెలిసింది. బ్రా బ్రాండ్ ప్రమోషన్ కూడా విజయవంతంగా జరిగింది. ఏదేమైనా ఆమె తెలివైన పనే చేసిందని, ఇలా వివాదం కోరుకొనే ఆమె ఈ రిస్క్ చేసిందని కొందరు అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఏంటి అనేది సిడ్నీ స్వీనీనే చెప్పాల్సి ఉంది.

Updated Date - Jan 27 , 2026 | 08:46 PM