స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డేకు భారీ క్రేజ్.. టికెట్ ధరలు చూస్తే షాక్!
ABN , Publish Date - Jul 28 , 2026 | 06:27 PM
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ (Spider-Man: Brand New Day) విడుదలకు రంగం సిద్ధమైంది.
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ (Spider-Man: Brand New Day) విడుదలకు రంగం సిద్ధమైంది. టామ్ హాలెండ్ మరోసారి పీటర్ పార్కర్ పాత్రలో నటించిన ఈ చిత్రం జులై 30న భారతీయ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తవగా, దేశవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. అయితే సినిమా కంటే ఎక్కువగా ఇప్పుడు టికెట్ ధరలే హాట్ టాపిక్ గా మారాయి. భారత్‌లోని ప్రధాన నగరాల్లో థియేటర్, స్క్రీన్ ఫార్మాట్‌ను బట్టి టికెట్ ధరల్లో భారీ తేడా కనిపిస్తోంది. సాధారణ స్క్రీన్‌లలో రూ.200 నుంచి టికెట్లు లభిస్తున్నప్పటికీ, ఐమ్యాక్స్, ప్రీమియం, రిక్లైనర్ వంటి లగ్జరీ ఫార్మాట్లలో ధరలు వేల రూపాయలకు చేరుకున్నాయి. ఢిల్లీలో ప్రీమియం సీట్ల ధరలు దాదాపు రూ.2,400 వరకు ఉండగా, ముంబయిలో కూడా లగ్జరీ షోల కోసం ప్రేక్షకులు భారీ మొత్తాలు చెల్లిస్తున్నారు. బెంగళూరులో కొన్ని ప్రీమియం స్క్రీన్‌లలో టికెట్ ధర రూ.3,700 దాటడం విశేషం.
మరోవైపు ఈ సినిమాపై అంతర్జాతీయ స్థాయిలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా తొలి వారాంతంలోనే రికార్డు స్థాయి వసూళ్లు సాధించే అవకాశముందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అంచనాలకు అనుగుణంగా స్పందన వస్తే, ఈ చిత్రం హాలీవుడ్‌లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. 144 నిమిషాల 52 సెకన్ల నిడివితో తెరకెక్కిన ఈ చిత్రం మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో 38వ సినిమాగా, స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజీలో నాలుగో భాగంగా విడుదలవుతోంది. టామ్ హాలెండ్‌తో పాటు జెండాయా, సేడీ సింక్, జాకబ్ బాటలాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.