బాక్సాఫీస్ వద్ద.. 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' విధ్వంసం! 10 రోజుల్లోనే.. 322 మిలియన్లు డాలర్లు
ABN , Publish Date - Apr 01 , 2026 | 07:19 AM
గత శుక్రవారం థియేటర్లకు వచ్చిన హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ హెయిల్ మేరీ ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద పెద్ద సునామీని సృష్టిస్తోంది.
గత శుక్రవారం థియేటర్లకు వచ్చిన హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ హెయిల్ మేరీ (Project Hail Mary) ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద పెద్ద సునామీనే సృష్టిస్తోంది. 200 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మితమైన ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ దక్కించుకుని కేవలం 10 రోజుల్లోనే $322 మిలియన్ డాలర్ల (రూ.2500 కోట్లకు పైగా) మార్కును దాటేసింది. అమెరికాలో రిలీజ్ అయిన వారం తర్వాత ఇండియాలో ప్రధాన ప్రాంతీయ భాషల్లోనూ విడుదలైన ఈ సినిమా అదే ఆదరణను సంపాదించుకుని తగ్గేదేలే అనే లెవల్‌లో కలెక్షన్లు కొల్లగొడుతుంది. తొలి వీకెండ్ పూర్తయ్యేసరికి ఇండియాలో ఏకంగా ₹17.28 కోట్లు రాబట్టి విశ్లేషకులను అశ్చర్యానికి గురి చేసింది.
ఇక.. ఈ సినిమా మన దేశంలో తొలి రోజు ₹ 2.8 కోట్లు,రెండో రోజు 3.33 కోట్లు, నాలుగో రోజు 5.35 కోట్లు, నాలుగో రోజు 5.8 కోట్లు రాబట్టి ఔరా అనిపించింది. అంతేగాక మన దేశంలో ఇప్పటి వరకు హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల పేరిట నెలకొని ఉన్న రికార్డులను ఈ సినిమా తిరగరాస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే.. 'ఇంటర్‌స్టెల్లార్' కంటే 53%, 'డ్యూన్ 2' కంటే 35%, 'ది మార్షియన్' కంటే 89% అధిక వసూళ్లను సాధించింది. 'అవతార్: ఫైర్ అండ్ యాష్' (2025) తర్వాత భారతీయ ఆడియన్స్‌ను ఈ రేంజ్‌లో ఆకట్టుకుంటున్నఅంతర్జాతీయ చిత్రం ఇదే కావడం విశేషం.

దశాబ్దం క్రితం క్రిష్టోఫర్ నోలన్ (Christopher Nolan) దర్శకత్వంలో వచ్చిన ఇంటర్ స్టెల్లార్ (Interstellar) తరహా కథాంశానికి ఎమోషన్ కూడా జత కలిసిన ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులను అంతరిక్షంలో విహారించిన ఫీల్ ఇస్తోంది. ర్యాన్ గాస్లింగ్ (Ryan Gosling) హీరోగా నటించిన ఈ చిత్రానికి ఫిల్ లార్డ్ (Phil Lord), క్రిస్టోఫర్ మిల్లర్ (Christopher Miller) దర్శకత్వం వహించారు. నిపుణుడైన ఫిజిక్స్ టీచర్ గ్రేస్‌ను.. సూర్యుడి ప్రభావం తగ్గుతుండడం దాని వళ్ల జరగబోయే పరిణామాలను అంచనా వేసిన నాసా మానవాళి అంతటిని కాపాడేందుకు ఓ ప్రాజెక్టును చేపడుతుంది.
ఈ సందర్భంగా.. ఎంతో పరిజ్ఞానం ఉండి స్కూల్ పిల్లలకు పాఠాలు చెప్పడానికే పరిమితమైన ఫిజిక్స్ టీచర్ గ్రేస్‌ను ఈ ప్రాజెక్టులోకి తీసుకు వస్తారు. అయితే ఈ ప్రాజెక్టులో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లిన వారు తిరిగి భూమి మీదకు రావడం కుదరదు. దీంతో అక్కడి సైంటిస్టులంతా గ్రేస్‌కు మత్తు మందు ఇచ్చి బలవంతంగా అంతరిక్షంలోకి పంపిస్తారు. తీరా స్పేస్‌లోకి వెళ్లాక గ్రేస్ గతం మరిచిపోయి చాలా కాలం తర్వాత మేల్కొంటాడు. ఆపై మరో గ్రహం నుంచి వచ్చిన ఓ వింత అబ్జెక్ట్‌తో కనెక్ట్ అవడం, ఇద్దరు కలిసి తమ గ్రహాలను రక్షించుకున్నారా లేదా గ్రేస్ తిరిగి భూమిపై అడుగు పెట్టాడా లేదా అది ఎలా సాధ్యపడింది అనేదే ప్రాజెక్ట్ హెయిల్ మేరీ (Project Hail Mary) స్టోరి.