ఎక్స్‌ట్రాక్షన్ 3లో పియర్స్ బ్రాసన్న్ కీలక పాత్ర!
ABN , Publish Date - Aug 19 , 2026 | 04:31 PM
ఎక్స్‌ట్రాక్షన్ 3 మూవీలో మాజీ జేమ్స్ బాండ్ పియర్స్ బ్రాస్నన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
జేమ్స్ బాండ్ నటుడిగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న పియర్స్ బ్రాస్నన్ తాజాగా 'ఎక్స్‌ట్రాక్షన్ 3' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. క్రిస్ హేమ్స్ వర్త్ ప్రధాన పాత్ర పోషిస్తున్న 'ఎక్స్‌ట్రాక్షన్ 3'ని నెట్ ఫ్లిక్స్ కోసం నిర్మిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ ఫ్రాంచైజీలోని ఈ చిత్రంలో ‘ట్రెయిన్ టు బుసాన్’ ఫేమ్ డాన్ లీ, ‘28 ఇయర్స్ లేటర్: ది బోన్ టెంపుల్’ ఫేమ్ చి లూయిస్ - ప్యారీ, జో టస్లిమ్, సియెనా అగుడాంగ్ కూడా నటిస్తున్నారు. ఆసక్తికరంగా, డాన్ లీ ఇటీవల ఈ ఫ్రాంచైజీకి చెందిన కొరియన్ భాషా చిత్రమైన ‘టైగో’లో కూడా చేరారు. 'ఎక్స్‌ట్రాక్షన్ 3'లో ఇద్రిస్ ఎల్బా, గోల్షిఫ్తే ఫరహానీ కూడా యాక్ట్ చేస్తున్నారు. రస్సో బ్రదర్స్‌కు చెందిన ఏజీబీవో, హేమ్స్‌వర్త్‌కు చెందిన వైల్డ్ స్టేట్ సంస్థలు రూపొందిస్తున్న ఈ ఫ్రాంచైజీ, ఆండే పార్క్స్ గ్రాఫిక్ నవల ఆధారంగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.
ఈ ఫ్రాంచైజీలో హేమ్స్‌వర్త్ టైలర్ రేక్ అనే ఆస్ట్రేలియన్ కిరాయి సైనికుడిగా నటిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదకరమైన రక్షణ వ్యవస్థకు అతను హామిగా ఉంటాడు. ఈ థర్డ్ పార్ట్ కు సామ్ హార్గ్రేవ్ దర్శకత్వం వహిస్తున్నారు. డేవిడ్ వెయిల్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఇక పియర్స్ బ్రాస్నన్ విషయానివస్తే ఆయన హెలెన్ మిర్రెన్, బెన్ కింగ్స్‌లీ, జొనాథన్ ప్రైస్‌లతో కలిసి ‘ది థర్స్‌డే మర్డర్ క్లబ్’లో నటించారు. అలాగే పారామౌంట్ ప్లస్ క్రైమ్ డ్రామా ‘మాబ్‌ల్యాండ్’లోనూ యాక్ట్ చేశారు. 'ఎక్స్‌ట్రాక్షన్' మొదటి రెండు భాగాలు 2020, 2023లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యి అత్యంత వీక్షకాదరణ పొందాయి. తొలి భాగం విడుదలైన మొదటి నెలలోనే 9.9 కోట్ల కుటుంబాలు వీక్షించగా, రెండో భాగాన్ని రెండు నెలల్లో 12.93 కోట్ల కుటుంబాలు చూశాయని నెట్ ఫ్లిక్స్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
పెళ్ళైన మగాడితో అడ్డంగా దొరికిన ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్...
Balakrishna: 'రాముడు - భీముడు' సినీ నిర్మాత మృతి
ఓటీటీకి వచ్చేస్తోన్న కల్ట్ క్లాసిక్ చెన్నై లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చు అంటే