స్పైడర్‌ మ్యాన్‌ బ్రాండ్‌ న్యూ డే: వ్యూస్‌ పరంగా క్రేజ్‌ మామూలుగా లేదు..

ABN , Publish Date - Mar 27 , 2026 | 07:34 PM

సూపర్‌ హీరో స్పైడర్‌ మ్యాన్‌ క్రేజ్‌ ఎలాంటితో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్‌ చిత్రాలకు ఉన్న ఫాలోయింగ్‌ గురించి తెలిసిందే.

సూపర్‌ హీరో స్పైడర్‌ మ్యాన్‌ క్రేజ్‌ ఎలాంటితో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్‌ చిత్రాలకు ఉన్న ఫాలోయింగ్‌ గురించి తెలిసిందే.  స్పైడర్‌మ్యాన్‌ ఫ్రాంచైజ్‌ నుంచి రాబోతున్న చిత్రం ‘స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే’ (Spider-Man: Brand New Day). ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. సోషల్‌ మీడియాలో రికార్డుల మోత మోగిస్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఇంగ్లిష్‌ ట్రైలర్‌కు 30 మిలియన్ల వ్యూస్‌ రాగా, తెలుగు టైలర్‌కు 2.3 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. ఈ రికార్డ్‌ చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థమవుతోంది.

డెస్టిన్‌ డేనియల్‌ క్రెట్టన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టామ్‌ హాలండ్‌ మరోసారి స్పైడర్‌ మ్యాన్‌గా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా జెండయా నటిస్తుండగా, జాకబ్‌ బాటలన్‌, సాడీ సింక్‌, జాన్‌ బెర్న్తాల్‌, మార్క్‌ రుఫలో, మైఖేల్‌ మాండో తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే’ చిత్రాన్ని సోనీ పిక్చర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ద్వారా ఈ ఏడాది జూలై 31న ఇంగ్లిష్‌తోపాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. 

Updated Date - Mar 27 , 2026 | 08:35 PM