జాసన్ మామ.. మళ్లీ అదిరిపోయే యాక్షన్ సినిమాతో రెడీ అయ్యాడు! మ్యూటినీ ట్రైలర్
ABN , Publish Date - Apr 10 , 2026 | 12:28 PM
ఇటీవలే షెల్టర్ అనే సినిమాతో ప్రేక్షకుల ఎదుటకు వచ్చి ఆకట్టుకున్నహాలీవుడ్ అగ్ర హీరో జాసన్ స్టాథమ్ ఇప్పుడు మరో యాక్షన్ అడ్వెంచర్ సినిమాతో అలరించేందుకు సిద్దమయ్యాడు.
ఇటీవలే షెల్టర్ అనే సినిమాతో ప్రేక్షకుల ఎదుటకు వచ్చి ఆకట్టుకున్నహాలీవుడ్ అగ్ర హీరో జాసన్ స్టాథమ్ (Jason Statham) ఇప్పుడు మరో యాక్షన్ అడ్వెంచర్ సినిమాతో అలరించేందుకు సిద్దమయ్యాడు. ఆయన నటించిన కొత్త హాలీవుడ్ చిత్రం మ్యూటినీ (Mutiny) ట్రైలర్ గురువారం రాత్రి విడుదల చేశారు.
జీన్-ఫ్రాంకోయిస్ రిచెట్ (Jean-François Richet) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అన్నాబెల్లె వాలిస్ (Annabelle Wallis), రోలాండ్ ముల్లర్ (Roland Møller), జాసన్ వాంగ్ (Jason Wong), కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఆగస్టు 21న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
ఒకప్పుడు అమెరికా స్పెషల్ ఫోర్సెస్‌లో, ఆపై న్యూయార్క్ పోలీస్ అధికారిగా పని చేసిన కోల్ రీడ్ ఆ ఉద్యోగాలకు స్వస్తి పలికి ఓ ప్రైవేట్ సెక్యూరిటీలో పని చేస్తుంటాడు. అయితే అనుకోకుండా తన మిత్రుడు బిలియనీర్ టిబు హత్య కేసులో రీడ్ ఇరుక్కుంటాడు. ఈ నేపథ్యంలో దానిని నుంచి తప్పించుకునే క్రమంలో అతనిపై అంతర్జాతీయ స్థాయిలో ఓ కుట్ర జరుగుతుందనే విషయం తెలుస్తుంది.
ఈ క్రమంలో రీడ్ వాటిని ఎలా అధిగమించడానేది ఈ చిత్రం కథ. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తే జాసన్ గత చిత్రాలను మించి కళ్లు బైర్లు కమ్మే యాక్షన్ సన్నివేశాలతో మూవీని తెరకెక్కించినట్లు అర్థం అవుతోంది. ఓ సమయంలో వీడెవడురా బాబు జాన్ విక్‌కు తాతలా ఉన్నాడని మాట్లాడుకునేలా ఆ ఫైటింగ్ సన్నివేశాలు, ట్రైలర్ ఉన్నాయి. ఇంకా ఆలస్యం ఎందుకు.. చూసేయండి ట్రైలర్.