The Death of Robin Hood: కొత్త.. రాబిన్ హుడ్ వచ్చేస్తున్నాడు! ఎక్స్ మెన్.. ఇలా అయ్యాడేంటి
ABN , Publish Date - Jan 07 , 2026 | 07:50 PM
ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించేందుకు ఓ హాలీవుడ్ సినిమా ది డెత్ ఆఫ్ రాబిన్ హుడ్ సిద్ధమవుతుంది.
ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించేందుకు ఓ హాలీవుడ్ సినిమా డెత్ ఆఫ్ రాబిన్ హుడ్ (The Death of Robin Hood) సిద్ధమవుతుంది. మనందరికీ బాగా తెలిసిన రాబిన్ హుడ్ కథతో మరో చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే ఇప్పటివరకు మనకు తెలిసిన కథ పేదవాళ్ల దగ్గర దోచి లేని వారికి పంచడం రాబిన్ హుడ్ పని. కానీ ఈ చిత్రం అందుకు పూర్తి విరుద్దంగా తెరకెక్కింది. వయసు మీద పడిన రాబిన్ హుడ్ గతంలో తను చేసిన నర మేధం గురించి తలుచుకుంటూ నిత్యం బాధ పడుతూ ఉంటాడు.
అయితే.. ఓ యుద్దంలో పాల్గొని తీవ్రంగా గాయపడి చావు బ్రతుకల మధ్య ఉంటాడు రాబిన్ హుడ్. ఆ సమయంలో ఓ మిస్టరీ అమ్మాయి అతన్ని కాపాడి తాను చేసిన తప్పుల విషయంలో ప్రాయశ్చితం చేసుకునేందుకు మార్గం చూపిస్తుంది. ఈ నేపథ్యంలో రాబిన్‌హుడ్ ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది, తన జీవితం ఏం నేర్పించిందనే కథకథనాలతో సినిమా సాగనుంది.
ఎక్స్‌మెన్ వంటి భారీ సినిమాలతో విశేష గుర్తింపు ఉన్న హ్యూజ్ జాక్‌మన్ (Hugh Jackman) హీరోగా నటించగా గతంలో పిగ్, ఏ క్వైట్ ఫ్లేస్ వంటి హిట్ సినిమాలను తెరకెక్కించిన మైఖేల్ సార్నోస్కీ (Michael Sarnoski) ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని వేసవిలో రిలీజ్ చేసేందుకు ఫ్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ విడుదల చేయగా వీక్షకులు, సినిమా లవర్స్ ను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా విజువల్స్, యాక్షన్ సీన్స్ అంతకుమించి అనేలా ఉన్నాయి. మీరు ఓ లుక్ వేయండి.