హాలీవుడ్ సినిమా ప్రచారంలో హృతిక్
ABN , Publish Date - Mar 22 , 2026 | 05:09 PM
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ మరోసారి తన ప్రత్యేక శైలితో ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ ప్రమోషన్‌లో భాగమయ్యారు.
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ మరోసారి తన ప్రత్యేక శైలితో ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ ప్రమోషన్‌లో భాగమయ్యారు. భారతీయ సినీ ప్రియులకు ఈ చిత్రాన్ని చేరువ చేయాలనే ఉద్దేశంతో హృతిక్ ఒక వినూత్న వీడియో చేశారు. ‘జాదూ వర్సెస్ రాకీ’ అంటూ ఓ ప్రత్యేక వీడియోతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేశారు హృతిక్ రోషన్. ఆయన నటించిన సూపర్ హిట్ సాంగ్ ‘ఏక్ పల్ కా జీనా’ ఐకానిక్ స్టెప్‌ను హాలీవుడ్ చిత్రంలోని ఏలియన్ క్యారెక్టర్ ‘రాకీ’కి నేర్పిస్తున్నటు ఆ వీడియోలో చూపించారు. హృతిక్, రాకీల మధ్య ఉన్న స్నేహాన్ని చూసి, ‘కోయీ.. మిల్ గయా’లోని హృతిక్ పాత ఏలియన్ స్నేహితుడు ‘జాదూ’ క్యూట్‌గా రియాక్ట్ అవ్వడం ఈ వీడియోలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.
హాలీవుడ్ స్టార్ ర్యాన్ గోస్లింగ్ నటించిన చిత్రమిది. ‘ది మార్షియన్’ ఫేమ్ ఆండీ వీర్ రాసిన బెస్ట్ సెల్లింగ్ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. గతేడాది డిసెంబర్‌లో ఈ నవలపై తనకున్న ఇష్టాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇప్పుడు అదే సినిమాను ఇండియాలో ప్రమోట్ చేస్తుండటం విశేషం. దీనిపై సోనీ పిక్చర్స్ ఇండియా ప్రతినిధి షోనీ పంజీకరణ్ ఆనందం వ్యక్తం చేశారు. ఫిల్ లార్డ్ - క్రిస్టోఫర్ మిల్లర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ర్యాన్ గోస్లింగ్, సాండ్రా హుల్లర్, కెన్ లెయుంగ్ కీలక పాత్రధారులు. ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఐమాక్స్ ఫార్మెట్‌లో ఈ నెల 26,న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.