They Will Kill You: ట్రైలరే.. ఈ రేంజ్‌లో ఉంటే! మరి సినిమా
ABN , Publish Date - Jan 07 , 2026 | 10:01 PM
తాజాగా విడుదలైన ఓ హాలీవుడ్ మూవీ దే విల్ కిల్ యూ (They Will Kill You) ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది.
తాజాగా విడుదలైన ఓ హాలీవుడ్ మూవీ దే విల్ కిల్ యూ (They Will Kill You) ట్రైలర్ యూట్యూబ్‌ను షాక్ చేస్తోంది. హర్రర్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌లో ఓ ఫొటో చూసి ఏదో నార్మల్ హాలీవుడ్ సినిమా అని వీడియో ఓపెన్ చేస్తే ఊసే వారిని ఖంగు తినేలా చేసింది. ఇప్పుడు ఎవరు చూసిన ఈ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. జాజీ బీట్జ్ (Zazie Beetz) కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కిరిల్ సోకోలోవ్ దర్శకత్వం వహించాడు.
ఓ యువతి.. న్యూయార్క్‌లోని ఓ ఒక లగ్జరీ హై-రైజ్ భవంతిలో దాని హిస్టరీ తెలుసుకోకుండానే హౌస్ కీపర్‌గా కొత్తగా చేరుతుంది. అయితే అక్కడ ఇదివరకు ఇలాగే అనేక మంది వచ్చి అదృశ్యమైన సంగతి ఆలస్యంగా తెలుస్తుంది. అంతేగాక ఆ భవనం ఓ సైథాన్ అధీనంతో ఉందని ప్రతి నెలా ఒకరిని అతనికి బలి ఇవ్వాల్సి ఉంటుందని అందుకోసమే తనని ఈ జాబ్‌లోకి తీసుకు విషయం బయట పడుతుంది. ఈ నేపథ్యంలో అ యువతి అక్కడి నుంచి సురక్షితంగా బయట పడిందా లేదా అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు.
ఇదివరకు మనం చూసిన జాన్ విక్, బాలీవుడ్ కిల్, మూవీల తరహాలోనే ఔట్ అండ్ ఔట్ రా అండ్ రస్టిక్ యాక్షన్ బ్లడ్ బాత్ చిత్రంగా మూవీ ఉండనుంది. అ భవంతిలో చిక్కుకున్న యువతి అక్కడి వారిని ఏలా ఢీ కొంది, వారిని అంతమొందించేందుకు ఏ స్థాయిలో పోరాటం చేసిందని ట్రైలర్‌లో అద్భుతంగా చూపించారు. హాలీవుడ్ సినిమాలు అంటే మక్కువ గల వారు ముఖ్యంగా డెడ్లీ వయలెంట్ చిత్రాలు ఇష్టపడే వారికి ఈ సినిమా ఫీస్ట్ అనడంలో సందేహం లేదు. అంతలా ఆ సన్నివేశాలు గగుర్పొడిచేలా తెరకెక్కించారు. ఈ మూవీ మార్చి 27న ప్రపంచవ్యాప్తగా థియేటర్లలో విడుదల కానుంది. మీరూ ఇప్పుడే ట్రైలర్ చూసేయండి.