ఇదెక్క‌డి 'బోయునా'రా నాయ‌నా.. అన‌కొండ‌కు తాత‌లా ఉంది

ABN , Publish Date - Aug 14 , 2026 | 09:14 AM

హారర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మరో ఆసక్తికరమైన చిత్రం సిద్ధమైంది.

BEWARE BOIÚNA

హారర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మరో ఆసక్తికరమైన చిత్రం సిద్ధమైంది. ఇప్ప‌టివ‌ర‌కు నాలుగైదు భాగాలుగా వ‌చ్చి ప్ర‌పంచ వ్యాప్తంగా విశేష‌ ఆద‌ర‌ణను సొంతం చేసుకున్న అన‌కొండ త‌ర‌హా చిత్రాల మాదిరి ‘బివేర్ బోయునా’ (BEWARE BOIÚNA) సినిమా రిలీజ్‌కు రెడీ అయింది.

ఈ నేప‌థ్యంలో తాజాగా గురువారం ఈ మూవీ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్‌ విడుద‌ల చేశారు. మైక్ పి. నెల్సన్ (Mike P. Nelson) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జెస్సికా రోతే, కియానా మదీరా, లోగాన్ మార్షల్-గ్రీన్, జాక్సన్ బ్యూస్, జువాన్ పాబ్లో షుక్, విల్ క్లోజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. కాగా ఈ చిత్రం ఆక్టోబ‌ర్ 2న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా థియేట‌ర్ల‌లోకి రానుంది.

ఈ ట్రైల‌ర్‌ను ప‌రిశీలిస్తే.. ఓ వైద్య బృందం అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌కు వెళ్లగా అక్క‌డ అతి భ‌యంక‌ర‌మైన భారీ బోయునా స‌ర్పం వారి వెంటాడుతుంది. ఈ క్ర‌మంలో ఎప్పుడు ఏ వైపు నుంచి ముప్పు వస్తుందో తెలియని పరిస్థితుల న‌డుమ‌ వారు అక్క‌డ ఎలా స‌ర్వైవ్ అయ్యారనేది ప్ర‌ధానాంశం. ఆ బోయినా వారి వెంట ఎందుకు ప‌డింది చివ‌ర‌కు వారు బ‌య‌ట‌ ప‌డ్డారా లేదా అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌తో ఉత్కంఠభరిత సన్నివేశాలు, భయపెట్టే విజువల్స్‌తో సర్వైవల్ అంశాలను హారర్‌తో మిళితం చేస్తూ సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

Updated Date - Aug 14 , 2026 | 09:15 AM