హారర్ అభిమానులకు కొత్త ట్రీట్.. బ్రీడర్ ట్రైలర్
ABN , Publish Date - Aug 27 , 2026 | 09:12 PM
హారర్, సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మరో ఆసక్తికర చిత్రం సిద్ధమవుతోంది.
హారర్, సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మరో ఆసక్తికర చిత్రం సిద్ధమవుతోంది. డేనియల్ డోహెని, డాట్-మేరీ జోన్స్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్రీడర్ ‘BREEDER’ మూవీ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి హారర్ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది.
ట్రైలర్‌ను పరిశీలిస్తే, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ కాలేజీ విద్యార్థి జీవితంలో జరిగే అనూహ్య సంఘటనల చుట్టూ కథ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. పరిశోధన కోసం ఆర్థిక సహాయం అందిస్తానని ఓ మహిళ అతనికి ఆఫర్ ఇస్తుంది. ఆ అవకాశాన్ని స్వీకరించిన యువకుడు ఆమెకు చెందిన దూర ప్రాంతంలోని ఓ రాంచ్‌కు చేరుకుంటాడు. అయితే అక్కడ అడుగుపెట్టిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి.
మొదట సాధారణంగా కనిపించిన ఆ ప్రాంతం క్రమక్రమంగా భయానక రహస్యాలు బయట పడుతుంటాయి. అక్కడ జరుగుతున్న విచిత్ర సంఘటనలు, ఊహించని మలుపులు, పరిస్థితులు కథలో కీలకంగా ఉండబోతున్నాయని ట్రైలర్‌ను చూస్తే స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఆ మహిళ అసలు ఉద్దేశం ఏమిటి? యువకుడు ఏ ప్రమాదంలో చిక్కుకున్నాడు? అనే ప్రశ్నలను ప్రేక్షకుల ముందుంచుతూ ట్రైలర్ ఆసక్తిని పెంచుతోంది.
సినిమాలోని డార్క్ విజువల్స్, ఉత్కంఠభరితమైన నేపథ్య సంగీతం, సస్పెన్స్ ఎలిమెంట్స్ హారర్ జానర్ అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రతి సన్నివేశంలో టెన్షన్‌ను పెంచే విధంగా ట్రైలర్‌ను రూపొందించడంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. హారర్, మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్ అంశాల సమ్మేళనంగా తెరకెక్కిన ఈ ‘BREEDER’ చిత్రం ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని అందించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాగా ఈ చిత్రం అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.