ఇన్సిడియస్.. ట్రైల‌ర్‌! ఉండాలా.. పోవాలా! మ‌రి ఇంత‌లా భ‌య‌పెడ‌తారా

ABN , Publish Date - Apr 15 , 2026 | 07:58 PM

హ‌ర్ర‌ర్‌, హాలీవుడ్ సినిమా ప్రియుల‌ను అల‌రించేందుకు ఓ అదిరిపోయే సూప‌ర్ నాచుర‌ల్ హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ సినిమా సిద్ధ‌మైంది.

INSIDIOUS

హ‌ర్ర‌ర్‌, హాలీవుడ్ సినిమా ప్రియుల‌ను అల‌రించేందుకు ఓ అదిరిపోయే సూప‌ర్ నాచుర‌ల్ హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ సినిమా ఇన్సిడియస్: అవుట్ ఆఫ్ ది ఫర్దర్ (Insidious: Out Of The Further) సిద్ధ‌మైంది. మూడేండ్ల క్రితం 2023లో వ‌చ్చిన ఇన్సీడియ‌స్ ది రెడ్ డోర్ (Insidious: The Red Door) చిత్రానికి సీక్వెల్‌గా ఇన్సీడియ‌స్ ఫ్రాంచైజీలో 6వ సినిమాగా ఈ మూవీ తెర‌కెక్కింది. జాక‌బ్ చేస్ (Jacob Chase) ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా సోనీ పిక్చ‌ర్స్ (Sony Pictures) ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తోంది.

అమేలియా ఈవ్ (Amelia Eve), బ్రాండన్ పెరియా (Brandon Perea), మైసీ రిచర్డ్‌సన్-సెల్లర్స్ (Maisie Richardson-Sellers), లిన్ షే (Lin Shaye) వంటి ప్ర‌ముఖ న‌టీన‌టులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఆగ‌స్టు21న ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ట్రైల‌ర్ చూస్తే ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన చిత్రాల‌కు భిన్నంగా ఈ మూవీ ఉండ‌నుంద‌నే విష‌యం స్ప‌ష్టంగా అవ‌గ‌త‌మ‌వుతోంది. హ‌ర్ర‌ర్ స‌న్నివేశాలు స్ట‌న్నింగ్ ఉండి ఫ‌స్ట్ టైం చూసే వారు జ‌డుసుకునేలా ఉన్నాయి.

త‌ల్లీ కూతురు ఇద్ద‌రే ఒంట‌రిగా ఓ ఇంట్లో నివ‌సిస్తూ ఉండ‌డం వారు అనుకోకుండా ఒక డార్క్, స్పిరిట్ వరల్ఢ్‌లో చిక్కుకు పోతారు. అక్క‌డి నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నాలు చేయ‌డం, ఆపై ఆత్మ‌లు వెంటాడ‌డం, మ‌రికొన్ని దుష్ట శ‌క్తులు సైతం బ‌య‌ట‌కు వ‌చ్చి భ‌యాన‌క ఘ‌ట‌న‌లు ఒళ్లు జ‌ల‌ద‌రించేలా ఉన్నాయి. చూస్తుంటే హ‌ర్ర‌ర్ మూవీస్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సినిమా ఆ కోరిక తీర్చేలానే ఉంది. ఇంకెందుకు ఆల‌స్యం ఇప్పుడే మీరూ ఇన్సిడియస్: అవుట్ ఆఫ్ ది ఫర్దర్ (Insidious: Out Of The Further) ట్రైల‌ర్ చూసి భ‌య ప‌డండి.

Updated Date - Apr 15 , 2026 | 08:31 PM