హాలీవుడ్‌లో విషాదం.. ఘోర రోడ్డు ప్రమాదంలో గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ నటి దుర్మరణం

ABN , Publish Date - Jul 21 , 2026 | 10:29 PM

హాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ (Godzilla vs Kong) సినిమాలో జియా పాత్రలో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న 18 ఏళ్ల కేలీ హాటిల్ (Kaylee Hottle) మరణించింది.

Godzilla vs Kong

హాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ (Godzilla vs Kong) సినిమాలో జియా పాత్రలో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న 18 ఏళ్ల కేలీ హాటిల్ (Kaylee Hottle) మరణించింది. మేరీల్యాండ్‌లో జరిగిన భయానక కార్ యాక్సిడెంట్‌లో ఆమె తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు కేలీ తండ్రి జోషువా హాటిల్ అధికారికంగా తెలియజేశాడు. దీంతో హాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి.


యాక్సిడెంట్ జరిగిన వెంటనే కేలీని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమెకు గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోయిందని ఆమె తండ్రి కన్నీటిపర్యంతమయ్యారు. అయితే, ఆమె మరణానికి గల అధికారిక కారణాలు ఇంకా పూర్తిగా వెల్లడి కావాల్సి ఉంది. తన కుమార్తె మృతిపై ఆమె తండ్రి ఫేస్‌బుక్‌లో చేసిన లైవ్‌స్ట్రీమ్ అందరినీ కంటతడి పెట్టించింది.


2021లో వచ్చిన గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ చిత్రంలో కాంగ్‌తో సైన్ లాంగ్వేజ్ (సజ్ఞల భాష) ద్వారా సంభాషించే జియా'పాత్రలో కేలీ అద్భుతమైన నటనను కనబరిచింది. తన సహజసిద్ధమైన అభినయంతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ చిన్నారి నటి, ఇంత చిన్న వయసులోనే దారుణమైన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల సినీ ప్రముఖులు, నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jul 21 , 2026 | 10:33 PM