గాడ్జిల్లా మైన‌స్ జీరో.. టీజ‌ర్ వ‌చ్చేసింది

ABN , Publish Date - Apr 15 , 2026 | 05:24 PM

రెండు సంవ‌త్స‌రాల క్రితం అనామ‌కంగా థియేట‌ర్ల‌కు వ‌చ్చి ప్ర‌పంచ వ్యాప్తంగా బాక్సాఫీసును షేక్‌ చేసి ఆస్కార్ సైతం ద‌క్కించుకున్న చిత్రం గాడ్జిల్లా మైన‌స్ వ‌న్.

GODZILLA

సుమారు రెండు సంవ‌త్స‌రాల క్రితం జ‌పాన్ దేశం నుంచి అనామ‌కంగా థియేట‌ర్ల‌కు వ‌చ్చి ప్ర‌పంచ వ్యాప్తంగా బాక్సాఫీసును షేక్‌ చేసి ఆస్కార్ సైతం ద‌క్కించుకున్న చిత్రం గాడ్జిల్లా మైన‌స్ వ‌న్ (Godzilla Minus One). అప్ప‌టి వ‌ర‌కు హాలీవుడ్ నుంచి వ‌చ్చిన అనేక గాడ్జిల్లా సినిమాల‌ను త‌ల‌ద‌న్నేలా విజువ‌ల్ గ్రాండియ‌ర్‌గా అతి స్వ‌ల్ప బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త థ్రిల్ అంద‌జేసింది. ఇప్పుడు ఈ మూవీకి ఫ్రీక్వెల్ గాడ్జిల్లా మైన‌స్ జీరో (GODZILLA MINUS ZERO) విడుద‌ల‌కు సిద్ధ‌మైంది.

జ‌పాన్ జాన‌ప‌ద ఇతిహాసాల‌ను, న‌వ‌ల‌లను అధారంగా చేసుకుని 1945 రెండో ప్ర‌పంచ యుద్దం ముగింపు స‌మ‌యాన్ని ఇతివృత్తంగా చేసుకుని ద‌ర్శ‌కుడు తకాషి యమజాకి గాడ్జిల్లా మైన‌స్ వ‌న్ (Godzilla Minus One) చిత్రాన్ని తెర‌కెక్కించారు. దీనికి ముందు గాడ్జిల్లా ఎలా ఉద్బ‌వించింది ఎక్క‌డి నుంచి వ‌చ్చింది, అది సృష్టించిన విద్వంసం ఏ స్థాయిలో జ‌రిగింది, దానిని అడ్డుకునేందుకు ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేశారనే క‌థ‌క‌థ‌నాల‌తో ఆధ్యంతం అల‌రించేలా రూపొందించారు. వేస‌వి సంద‌ర్భంగా 11 జూన్‌న థియేట‌ర్ల‌కు తీసుకురానున్నారు.

Updated Date - Apr 15 , 2026 | 05:26 PM