పండిట్‌ రవిశంకర్‌గా.. ఫర్హాన్‌ అక్తర్‌

ABN , Publish Date - Apr 22 , 2026 | 09:39 AM

ఇటీవ‌లే 120 బ‌హ‌దూర్‌తో సినిమాతో అల‌రించిన ఫర్హాన్‌ అక్తర్‌ మ‌రో సారి బ‌యోపిక్‌లో న‌టించేందుకు సిద్ధం అవుతున్నాడు.

Farhan Akhtar

బహుముఖ ప్రజ్ఞశాలిగా బాలీవుడ్‌లో మంచి పేరున్న న‌టుడు, నిర్మాత‌, ద‌ర్శ‌కుడు ఫర్హాన్‌ అక్తర్‌ (Farhan Akhtar). ఇటీవ‌లే 120 బ‌హ‌దూర్‌తో సినిమాతో అల‌రించిన ఆయ‌న మ‌రో సారి ఓ బ‌యోపిక్‌లో న‌టించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇప్ప‌టికే భాగ్ మిల్కా భాగ్ సినిమాతో విశేష గుర్తింపును సొంతం చేసుకున్న ఆయ‌న ఇప్పుడు సితార మాస్ట్రో పండిట్ ర‌వి శంక‌ర్ పాత్ర‌ను పోషిస్తున్నాడు.

ఈ సంద‌ర్భంగా ఫర్హాన్‌ మాట్లాడుతూ.. ‘భారతీయ సంగీత శిఖరం. సితార మాస్ట్రో పండిట్‌ రవిశంకర్ (Ravi Shankar) పాత్ర పోషించే అవకాశం లభించడం నిజంగా నా అదృష్టం. ఇది ఓ గొప్ప బాధ్యతగా భావిస్తున్నాను. నా శాయశక్తులా కృషి చేసి రవిశంకర్‌ పాత్రలో ఒదిగిపోవడానికి కృషి చేస్తాను’ అని చెప్పారు. ఇదిలాఉంటే.. ‘ది బీటిల్స్‌’ (The Beatles) పేరుతో ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతిగాంచిన మ్యూజిక్ లెజెండ్స్ నేప‌థ్యంలో ఈ బయోపిక్‌ను ఆస్కార్‌ అవార్డ్‌ గ్రహీత శామ్‌ మెండెస్ (Sam Mendes) నాలుగు భాగాలుగా రూపొందిస్తున్నారు.

స్వతహాగా గిటారిస్ట్‌, సింగ‌ర్ కూడా అయిన‌ ఫర్హాన్‌ ఇప్పుడు సితార వాయిద్యాన్ని నేర్చుకుంటున్నారు, సంగీతం పట్ల రవిశంకర్‌కు ఉన్న అభిరుచిని, ఆయన జీవన వేదాంతాన్ని ఆకళింపు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు ఫర్హాన్‌. పండిట్‌ రవిశంకర్‌ కుమార్తె, తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకున్న అనుష్క శంకర్‌ను తరచూ కలుస్తూ, ఆమె దగ్గర సితార వాయిద్యాన్ని నేర్చుకుంటున్నారు. తొలిసారిగా ఫర్హాన్‌ నటిస్తున్న ఈ హాలీవుడ్‌ చిత్రం ‘ది బీటిల్స్‌’ 2028 ఏప్రిల్‌లో విడుదలవనుంది.

Updated Date - Apr 22 , 2026 | 11:33 AM