Evil Dead Burn: ఈవిల్ డెడ్ బ‌ర్న్‌ తెలుగు ట్రైల‌ర్‌.. చూసి ప్రాణాలు పోతే మా బాధ్య‌త లేదు

ABN , Publish Date - Jun 11 , 2026 | 06:48 PM

ప్ర‌పంచ వ్యాప్తంగా ఈవిల్ డెడ్ హ‌ర్ర‌ర్ సిరీస్ సినిమాలంటే ప్ర‌త్యేక క్రేజ్ ఉన్న సంగ‌తి తెలిసిందే.

Evil Dead Burn

ప్ర‌పంచ వ్యాప్తంగా ఈవిల్ డెడ్ హ‌ర్ర‌ర్ సిరీస్ సినిమాలంటే ప్ర‌త్యేక క్రేజ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ సిరీస్‌లో ఐదు సినిమాలు వ‌చ్చి విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకోగా ఇప్పుడు మ‌రో చిత్రం ఈవిల్ డెడ్ బ‌ర్న్ (Evil Dead Burn) విడుద‌ల‌కు ముస్తాబ‌యింది. ఈ మూవీకి సెబాస్టియన్ వానిచెక్ (Sébastien Vaniček) దర్శకత్వం వహించడంతో పాటు సహ-రచయితగా కూడా వ్యవహరించారు.

సౌహీలా యాకూబ్, టాండి రైట్, హంటర్ డూహన్, లూసియాన్ బుకానన్, ఎర్రోల్ షాండ్, మౌడ్ డేవీ, జార్జ్ పుల్లర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇప్ప‌టికే రిలీజ్ చేసిన ఈ సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్లు సినిమాపై అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచేయ‌గా జూలై 10న థియేట‌ర్ల‌లోకి రానుంది. తాజాగా ఈ చిత్రం తెలుగు వ‌ర్ష‌న్ ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌గా మంచి వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకు వెళుతుంది.

అనుకోని ప్ర‌మాదంలో ఓ కుమారుడిని కోల్పోయి విషాదంలో ఉన్న‌ ఓ త‌ల్లి వ‌ద్ద‌కు మిగిలిన కుటుంబ స‌భ్యులు వ‌స్తారు. అయితే.. న‌గ‌రానికి దూరంగా అ ఇంటికి చేరుకున్నాక ఆ ఫ్యామిలీలో భ‌యంక‌ర‌ దుర్ఘ‌ట‌న‌లు ఎదుర‌వుతాయి. ఒక్కొక్క‌రుగా దుష్ట‌ శ‌క్తుల బారిన ప‌డి డెడైట్స్‌గా మారి పోతారు. దాంతో ఆ ఇల్లంతా ర‌క్త‌పాతం, భ‌యాన‌క ఘ‌ట‌న‌ల‌తో నిండిపోతుంది. ఈ క్ర‌మంలో ఎవ‌రైనా ఆ ఘ‌ట‌న‌ల నుంచి బ‌తికగ‌లిగారా లేదా, అస‌లు డెడైట్స్‌గా మార‌డానికి గ‌త కార‌ణ‌మేంట‌నేదే క‌థ‌.

ఈ క్ర‌మంలో విడుద‌ల చేసిన‌ ట్రైల‌ర్‌ను చూస్తే ఒళ్లు జ‌ల‌ద‌రించేలా ఉంది. డెడైట్స్‌గా మారిన స‌మ‌యంలో వ‌చ్చే స‌న్నివేశాలు చూసే వారికి భ‌యం క‌లిగించేలా ఉన్నాయి. గ‌త సినిమాల‌ను మించి ఈ మూవీలో స‌న్నివేశాలు ఉన్నాయి. కొత్త‌గా చూసే వారికి మాత్రం వెంట‌నే గుండె ఆగిపోవ‌డం గ్యారంటీ అనేలా విజువ‌ల్స్ ఉన్నాయి. మీ హృద‌యం గ‌ట్టిదైతే మీరే ఈ ట్రైల‌ర్‌పై ఓ లుక్ వేయండి. తెలుగులోనూ ఉంది.

Updated Date - Jun 11 , 2026 | 06:49 PM