ఇది కదా కావాల్సింది.. డ్యూన్ 3 ట్రైలర్ అదిరింది
ABN , Publish Date - Jul 09 , 2026 | 11:04 AM
తాజాగా విడుదలైన డ్యూన్ పార్ట్3 వీక్షకులను విపరీతంగా ఆకర్షిస్తోంది.
ఈ యేడు ప్రపంచ వ్యాప్తంగా.. సినీ లవర్స్ కళ్లలో ఒత్తులు వేసుకుని మరి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రెండు హాలీవుడ్ చిత్రాలు ది ఒడిస్సీ (The Odyssey), డ్యూన్ పార్ట్ 3 (Dune Part Three). ఇప్పటికే ఈ మూవీల నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్, ట్రైలరల్స్ అన్నీ ఒకదానిని మించి మరోటి మంచి ఆదరణను దక్కించుకున్నాయి. మరో వారం రోజుల్లో ది ఒడిస్సీ థియేటర్లలోకి రానుండగా డ్యూన్ డిసెంబర్ 18న ప్రేక్షకుల ఎదుటకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమవగా టికెట్ రేట్లు ఆకాశన్నంటుతున్నాయి.
అయితే.. తాజాగా డ్యూన్ పార్ట్ 3కి సంబంధించిన అఫీసియల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేయగా అంచనాలను మించి వ్యూస్ రాబడుతోంది. ఇంతకుముందే రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకుల్లో అటెన్షన్ తీసుకు రాగా కొత్తగా విడుదల చేసిన ట్రైలర్ అంతకుమించి అనేలా ఉంది. ముఖ్యంగా మ్యూజిక్, విజువల్స్ మెస్మరైజింగ్‌గా హై లెవల్‌లో ఉండి సినిమా ఎప్పుడు చూద్దామా అనే ఫీల్ తీసుకు వస్తోంది. మీరూ ట్రైలర్‌పై ఓ లుక్ వేయండి.