‘ఆస్కార్’ వేడుకకు సర్వం సిద్ధం.. ఎక్కడ చూడొచ్చంటే..
ABN , Publish Date - Mar 15 , 2026 | 09:39 PM
ప్రపంచ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఆస్కార్’ (98th oscars) అవార్డు వేడుకకు రంగం సిద్ధమైంది.
ప్రపంచ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఆస్కార్’ (98th oscars) అవార్డు వేడుకకు రంగం సిద్ధమైంది. 98వ ఆస్కార్ వేడుకకు ఎప్పటిలాగే లాస్ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్ వేదిక కానుంది. భారత కాలమానం ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున 4:30 నుంచి వేడుక మొదలు కానుంది. 24 విభాగాల్లో విజేతలకు పురస్కారాలు అందజేయనున్నారు. ఈసారి కొత్తగా క్యాస్టింగ్ డైరెక్టర్ విభాగాన్ని జోడించారు. ఇండియాలో ఏ వేడుకను ‘జియో హాట్‌స్టార్’ ఓటిటిలో, ప్రత్యక్ష ప్రసారం స్టార్ మూవీస్‌లో చూడొచ్చు. హాలీవుడ్ కమెడియన్ కోనన్ ఓబ్రియన్ దీనికి హోస్ట్‌గా వ్యవహరిస్తారు. ప్రియాంకా చోప్రా ప్రెజెంటర్‌లలో ఒకరిగా హాజరు కానున్నారు. ‘సిన్నర్స్’ చిత్రం 16 నామినేషన్స్‌తో అగ్రస్థానంలో ఉంది. ఈ చిత్రానికి అత్యధిక అవార్డులు రావొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.