Amy Nur Tinie: నా తండ్రి వయస్సు.. మూడో భార్యగా వస్తావా.. నెలకు 11 లక్షలు ఇస్తా అన్నాడు

ABN , Publish Date - Jan 02 , 2026 | 09:38 PM

ఇండస్ట్రీలో హీరోయిన్లకు చాలామంది అభిమానులు ఉంటారు. ఎక్కడకు వెళ్లినా వారి చుట్టూనే తిరుగుతూనే ఉంటారు. ఇంకా కొంతమంది అయితే వారి ఫోన్ నెంబర్లు అడుగుతూ ఇబ్బంది పెడుతూ ఉంటారు.

Amy Nur Tinie

Amy Nur Tinie: ఇండస్ట్రీలో హీరోయిన్లకు చాలామంది అభిమానులు ఉంటారు. ఎక్కడకు వెళ్లినా వారి చుట్టూనే తిరుగుతూనే ఉంటారు. ఇంకా కొంతమంది అయితే వారి ఫోన్ నెంబర్లు అడుగుతూ ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇక్కడవరకు ఓకే. మరికొంతమంది ఉంటారు.. తమకు నచ్చిన హీరోయిన్స్ కనిపిస్తే చాలు.. పెళ్లి చేసుకుంటాం.. అంత ఇస్తాం.. ఇంత ఇస్తాం అంటూ వారిని వస్తువును చూసినట్లు చూస్తారు. వీరందరూ ఒక ఎత్తు అయితే చాలామంది ప్రముఖులు హీరోయిన్ల అందానికి ముగ్దురాలై వారిని రెండో భార్యగా.. మూడో భార్యగా చేసుకుంటామని ముందుకొస్తారు.

తాజాగా ఒక మలేషియన్ నటికి ఇలాంటి ఆఫరే వచ్చింది. ఆమె పేరు అమీ నూర్ టీనీ. మలేషియా మోడల్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నా అమీ తాజాగా ఒక పాడ్ క్యాస్ట్ లో తనకు వచ్చిన ఒక వింత ప్రపోజల్ గురించి చెప్పుకొచ్చింది. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్.. తనను మూడో పెళ్లి చేసుకోమని అడిగినట్లు చెప్పుకొచ్చింది. దానికోసం అతను చాలా పెద్ద పెద్దఆఫర్లు కూడా ఇచ్చినట్లు తెలిపింది.

'నేను కార్పోరేట్ ఈవెంట్స్ కి యాంకర్ గా కూడా చేస్తాను. అక్కడ నా నెంబర్లు తీసుకొంటారు. అలా ఒక ఈవెంట్ కి వెళ్ళినప్పుడు ఒక వివిఐపీ నా నెంబర్ తీసుకొని కాల్ చేశాడు. అతనికి నా తండ్రి వయస్సు ఉంటుంది. కాల్ చేసి పెళ్లి ప్రపోజల్ చేశాడు. నాకు మూడో భార్యగా వస్తావా.. నీకు నెలకు రూ. 11 లక్షలు ఇస్తాను. ఒక కారు.. బంగ్లా, పది ఎకరాల ఆస్తి రాసి ఇస్తానన్నాడు. ఆ పిచ్చి ప్రపోజల్ కి నేను నో చెప్పాను. ఇలాగే ఒకసారి మా అమ్మని కూడా నా గురించి అడిగితే ఆమె వారికి గట్టి కౌంటర్ ఇచ్చింది. నా కూతురును ఎవరికి అమ్మాలనుకోవడం లేదు అని చెప్పింది' ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Updated Date - Jan 02 , 2026 | 09:38 PM