321 Review: 321 మూవీ ఎలా ఉందంటే
ABN , Publish Date - Oct 23 , 2026 | 01:07 PM
ఈ వారం విడుదలైన చిన్నచిత్రాల్లో 321 (లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్) ఒకటి. అరేంజ్డ్ మ్యారేజ్ అన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
సినిమా రివ్యూ: 321 (లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్)
విడుదల తేది: 23–10–2026
ఈ వారం విడుదలైన చిన్నచిత్రాల్లో 321 (లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్) ఒకటి. మోహిత్ పెద్దాడ, లావణ్య సాహుకర, వివాన్ సూర్య, లక్ష్మీ వెన్నెల ఇందులో కీలక పాత్రధారులు. స్వీయ దర్శకత్వంలో రామానుజ రెడ్డితో కలిసి శాంతికుమార్ చిలుముల దీనిని ప్రొడ్యూస్ చేశారు. లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్ మ్యారేజ్ అన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ:
అభి (మోహిత్ పెద్దాడ) ఈతరం ఆలోచనలు గల కుర్రాడు. ప్రేమించి పెళ్లి చేసుకోవడంలోనే ఆనందం ఉందని నమ్ముతాడు, శ్రుతి (లావణ్య సహుకార) పెద్దలు కుదిర్చిన పెళ్లే కరెక్ట్ అని నమ్మి వ్యక్తి. తన తల్లిదండ్రులది ప్రేమ వివాహం కావడం... వారు జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు చూసి ఆమెకు ప్రేమ వివాహం అంటే నచ్చదు. అభి తండ్రి మాత్రం పెద్దలు కుదిర్చిన పెళ్లే చేయాలనుకుంటాడు. శ్రుతి తల్లి కూడా ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలని కూతురిని హెచ్చరించి ఉద్యోగం కోసం నగరానికి పంపిస్తుంది. అభి, శ్రుతి ఒకే కంపెనీలో పని చేస్తుంటారు. శ్రుతిని చూడగానే అభి ప్రేమలో పడతాడు. బయటపడదు కానీ శ్రుతీకి కూడా అభి అంటే ఇష్టమే! అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో అభిని గతంలో చూసి, తిరస్కరించిన అమ్మాయి కూడా తానే కావాలని వెంట తిరుగుతుంది. రాధ పేరుతో ఫోన్లో ఓ అజ్ఞాత వ్యక్తి అభిని తగులుకుంటుంది. వీరిలో అభి ఎవర్ని చేసుకున్నాడు? లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్ మ్యారేజ్‌లో ఏది గొప్పది అన్నదానికి ఏం సమాధానమిచ్చారు? అన్నది కథ.
విశ్లేషణ:
ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో గ్రూప్ డిస్కషన్స్ లో లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్ మ్యారేజ్ టాపిక్‌తో కథ మొదలవుతుంది. హీరోహీరోయిన్ పరిచయం.. అమ్మాయిని పడేయడానికి హీరో చేసే ప్రయత్నాల నేపథ్యంలో ఫస్టాఫ్ అంతా సరదా సరదాగా సాగిపోతుంది. సెకెండాఫ్‌లో అసలు కథ ట్రాక్‌లోకి వస్తుంది. శ్రుతీ ప్రేమించిన వాడిని చేసుకోవాలా? పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలా అన్న డైలామాలో ఉండడంతో కథ మొత్తం భావోద్వేగ భరితంగా మారిపోతుంది. ఓ 20 నిమిషాల కథ కుటుంబ చర్చల నేపథ్యంలోనే సాగుతుంది. అజ్ఞాతవాసిలా ఫోన్లో మాట్లాడిన రాధ పాత్ర రివీల్ కావడం మంచి ట్విస్ట్‌గా నిలిచింది. క్లైమాక్స్ మాత్రం ట్విస్ట్‌తో హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు. సస్పెన్స్ మాత్రం బాగా క్యారీ చేశారు. అయితే సినిమా మొత్తం సీరియల్ తరహాలో సాగదీతగా సాగినా పెళ్లి ఇతివృత్తం.. పేరెంట్స్ బిడ్డలపై పెంచుకుని ప్రేమ వంటి కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుని... బ్యాలెన్స్ చేశాయి.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు...
మోహిత్ పెద్దాడ పక్కింటి అబ్బాయిలా చక్కని నటన కనబర్చాడు. లవ్, ఎమోషనల్ సన్నివేశాల్లో సహజంగా కనిపించాడు. చక్కని టైమింగ్‌తో వినోదాన్ని పంచాడు. శ్రుతి పాత్రలో లావణ్య హుందాగా నటించింది. క్లైమాక్స్‌లో భావోద్వేగాలను అద్భుతంగా పండించింది. విలువలు పాటిస్తూనే ఇండిపెండెంట్‌గా జీవించాలనుకునే ఈతరం అమ్మాయిగా మంచి మార్కులు పడతాయి. అభి స్నేహితుడిగా వివన్ సూర్య, శ్రుతి సన్నిహితురాలిగా లక్ష్మీ వెన్నెల తమ పాత్రలకు న్యాయం చేశారు. హీరోహీరోయిన్లకు తల్లిదండ్రులుగా నటించిన ఆరిస్ట్‌లు కూడా ఆ యా పాత్రల్లో ఒదిగిపోయారు. సినిమాటోగ్రఫీ బావుంది. కాల్విన్ జాయ్ సంగీతం బాగా కుదిరింది. రెండు పాటలు ఆకట్టుకున్నాయి. క్లైమాక్స్ సన్నివేశంలో నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బావున్నాయి. ఫస్టాఫ్‌ను కాస్తంత ట్రిమ్ చేసి ఉంటే, స్టోరీ రన్ క్రిస్ప్‌గా ఉండేది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ప్రేమించి పెళ్లి చేసుకున్నా, పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా ఇద్దరి వైపు పరస్పర అవగాహన, గౌరవం, నమ్మకంతో ఉంటే ఆనందం వెన్నంటి ఉంటుందని దర్శకుడు సందేశం ఇచ్చారు.
ట్యాగ్‌లైన్: ఫ్యామిలీ ఎంటర్ టైనర్!
రేటింగ్: 2.5/5