Kotha CInema: పల్లె నుంచి టాలీవుడ్‌కు.. 100 మంది కొత్త ప్రతిభావంతుల పరిచయం..
ABN , Publish Date - Aug 25 , 2026 | 11:58 PM
సినిమా అంటే హైదరాబాద్, చెన్నై, ముంబయి వంటి సినీ నగరాలకే పరిమితమని అనుకుంటాం. కానీ ప్రతిభ ఎక్కడైనా పుడుతుందని నిరూపిస్తూ.. ఓ పల్లె నుంచి ఏకంగా వంద మంది నూతన ప్రతిభావంతులను టాలీవుడ్‌కు పరిచయం చేస్తూ తెరకెక్కిన చిత్రం ‘కొత్త సినిమా’.
సినిమా అంటే హైదరాబాద్, చెన్నై, ముంబయి వంటి సినీ నగరాలకే పరిమితమని అనుకుంటాం. కానీ ప్రతిభ ఎక్కడైనా పుడుతుందని నిరూపిస్తూ.. ఓ పల్లె నుంచి ఏకంగా వంద మంది నూతన ప్రతిభావంతులను టాలీవుడ్‌కు పరిచయం చేస్తూ తెరకెక్కిన చిత్రం ‘కొత్త సినిమా’.అజర్ స్థానిక టాలెంట్‌తో రూపొందించిన ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. సురేశ్, రాకేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అజర్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంతో పాటు డైలాగ్స్, ఎడిటింగ్ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. మహమ్మద్ వాసిమ్ అక్రమ్, సాగి సుధీర్ రావు, యడండ్ల సతీష్ యాదవ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ‘కొత్త సినిమా’ను తెరకెక్కించే క్రమంలో ఎదురైన అనుభవాలు, తమ ప్రయాణాన్ని ప్రేక్షకులతో పంచుకునేందుకు సోమవారం హైదరాబాద్‌లో ‘వై ఇన్ హైదరాబాద్.. వై నాట్ ఇన్ అవర్ ప్లేస్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
దర్శకుడు అజర్ మాట్లాడుతూ "కొత్తవాళ్లకు ఎవరూ సపోర్ట్ చేయరనే భావనతో మొదలైన తమ ప్రయాణానికి ప్రేక్షకులు, సినీ ప్రముఖుల నుంచి లభిస్తున్న ఆదరణ ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు. సినిమా ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన మాధ్యమాల్లో ఒకటని, అలాంటి మాధ్యమం ద్వారా తాను కూడా ఒక మంచి ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ‘కొత్త సినిమా’ను ప్రారంభించానని చెప్పారు. తాను కొత్తవాడినని, తనతో పాటు కొత్తవాళ్లకు అవకాశాలు ఇస్తానని చెప్పినప్పుడు మొదట్లో ఎవరూ నమ్మలేదన్నారు. అయితే సొంత ఊరిలోనే ఆడిషన్స్ నిర్వహించి ప్రతిభ ఉన్నవారిని ఎంపిక చేసి, వారికి శిక్షణ ఇచ్చి సినిమాలో భాగం చేశామని చెప్పారు. సినిమా నిర్మాణ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నామని, వాటన్నింటినీ అధిగమించి ఇక్కడి వరకు వచ్చామని అజర్ పేర్కొన్నారు. త్వరలోనే థియేటర్లలోకి రాబోతున్న ‘కొత్త సినిమా’కు ప్రేక్షకులు ఇదే విధమైన ఆదరణ అందించాలని కోరారు.
కొత్త టైటిల్.. కొత్త ప్రయత్నం
దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ‘కొత్త సినిమా’ అనే టైటిల్ పెట్టడమే కాకుండా అజర్ నిజంగానే కొత్త ప్రయత్నం చేశారు. సాధారణంగా సినిమా నిర్మాణంలో ఖర్చులు, నటీనటుల ఎంపిక వంటి అంశాలు పెద్ద సవాళ్లుగా ఉంటాయి, అయితే అజర్ తన సొంత ప్రాంతానికి వెళ్లి అక్కడి ప్రతిభను గుర్తించి, వారికి శిక్షణ ఇచ్చి సినిమా రూపొందించడం అభినందనీయం. స్థానికంగా ఉన్న ప్రతిభను వెలికితీసి, వారితోనే సినిమా చేయడం గొప్ప ప్రయత్నం.. అజర్ ఒక అద్భుతమైన సినిమా చేసి ఉంటాడనే నమ్మకం ఉందని, ‘కొత్త సినిమా’ ఆయనకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను' అన్నారు,