స్పిరిట్‌: సందీప్ రెడ్డి వంగా.. మ‌రో హీరోయిన్‌ను దించుతున్నాడుగా

ABN , Publish Date - Feb 27 , 2026 | 10:15 PM

ప్రభాస్‌, సందీప్ రెడ్డి వంగా కొత్త సినిమా 'స్పిరిట్'లోకి సంబంధించిన నయా పోస్టర్‌లో దర్శనమిచ్చిన ఐశ్వర్యా దేశాయ్ గురించిన సమాచారం కోసం ఇప్పుడు నెటిజన్స్ జల్లెడ పడుతున్నారు.

Aishwarya Desai

సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా రూపుదిద్దుకుంటున్న 'స్పిరిట్' (Spirit) సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఒక సంచలనమే. తాజాగా విడుదలైన వివేక్ ఒబెరాయ్ లుక్ పోస్టర్‌లో, ఆయన పక్కనే కూర్చుని, బ్లాక్ గాగుల్స్ ధరించి సీరియస్ లుక్‌లో కనిపిస్తున్న ఒక నటి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె మరెవరో కాదు.. ఐశ్వర్య దేశాయ్ (Aishwarya Desai). ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, అసలు ఈమె ఎవరు? అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఇండో అమెరికన్‌ మోడల్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు, అంతర్జాతీయ స్థాయిలో పలు ఫ్యాషన్ షోస్‌లో పాల్గొనడంతో పాటు, ప్రసిద్ధ బ్రాండ్లకు సంబంధించిన ప్రకటనల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా మంది భావిస్తున్నట్లుగా 'స్పిరిట్' ఆమెకు మొదటి సినిమా కాదు.


123 copy.jpg

గతంలో ఐశ్వర్య దేశాయ్ 'గల్లీ బాయ్స్, రాట్ ఇన్ ద కిచెన్' వంటి చిత్రాల్లో నటించి తన నటనతో మెప్పించారు. ఆ అనుభవమే ఇప్పుడు వంగా సినిమాలో ఆమెకు ఒక కీలకమైన పాత్ర దక్కేలా చేసింది. 'స్పిరిట్‌'లో ఐశ్వర్య ఒక పవర్‌ఫుల్‌ రోల్‌లో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వివేక్ ఒబెరాయ్ పోషిస్తున్న నెగిటివ్ రోల్‌తో ఆమె పాత్రకు ఉన్న అనుబంధం కథలో ఒక ఊహించని మలుపుకు కారణమవుతుందని టాక్. ఇప్పటికే కొన్ని సినిమాలు చేసినప్పటికీ, ప్రభాస్ వంటి గ్లోబల్ స్టార్‌తో, సందీప్ రెడ్డి వంగా వంటి సెన్సేషనల్ డైరెక్టర్ ప్రాజెక్ట్‌లో భాగం కావడం ఆమె కెరీర్‌కు ఒక భారీ మైలురాయి కానుంది. వంగా మార్క్ ఇంటెన్సిటీతో రూపొందుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య దేశాయ్ తన నటనతో ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి!

Updated Date - Feb 27 , 2026 | 11:21 PM