రీల్‌ నుంచి రియల్‌ లోకి విక్రాంత్‌ మాస్సే!

ABN , Publish Date - Sep 21 , 2026 | 02:42 PM

జాతీయ ఉత్తమ నటుడు విక్రాంత్‌ మాస్సే కేఫ్‌ బిజినెస్ లోకి అడుగు పెడుతున్నాడు. 'ముసాఫిర్‌ కేఫ్‌' వెబ్ సీరిస్‌ లోని కేఫ్‌ లకు రిప్లికాలను రెండు హిల్‌ స్టేషన్స్ లో విక్రాంత్‌ ఏర్పాటు చేస్తున్నాడు.

Vikranth Massey

'ట్వెల్త్ ఫెయిల్‌' మూవీతో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్న విక్రాంత్‌ మాస్సే ఇప్పుడు రీల్‌ లైఫ్‌ లోని కెఫే లను రియల్‌ లైఫ్ లోకి తీసుకొచ్చే పనిలో పడ్డాడు. అతని సొంత నిర్మాణ సంస్థ హోమ్‌ మేడ్‌ స్టోరీస్ పేరుతోనే ఈ కెఫేల నిర్మాణానికి విక్రాంత్‌ శ్రీకారం చుట్టాడు. విశేషం ఏమంటే అతనికి ఈ విషయంలో స్ఫూర్తినిచ్చింది తను నటించిన వెబ్ సీరిస్‌ ముసాఫిర్‌ కేఫ్‌. ఈ రొమాంటిక్‌ కామెడీ సీరిస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ అయ్యి, వీక్షకుల ఆదరణ పొందింది. దాంతో అందులోని కేఫ్‌ లను రియల్‌ గా ఏర్పాటు చేయాలనే కోరిక విక్రాంత్‌ మాస్సేకు కలిగింది.


తన భార్య, నటి అయిన శీతల్‌ ఠాగూర్‌ స్వరాష్ట్రం హిమాచల్‌ ప్రదేశ్‌ లో ఒక కేఫ్‌ ను, మరొకదానిని ఉత్తరాఖండ్‌లోనూ విక్రాంత్ మాస్సే నిర్మిస్తున్నాడు. ఈ రెండు కూడా హిల్‌ స్టేషన్స్ కావడం విశేషం. అలానే కేవలం కేఫ్‌ ఏర్పాటుతో తృప్తి పడకుండా అక్కడకు క్రియేటివ్‌ పీపుల్ వచ్చి, కొన్ని రోజులు స్టే చేసి, తమ రచనా వ్యాసాంగాన్ని కొనసాగించేలా 20 గదులను కూడా విక్రాంత్‌ నిర్మిస్తున్నాడు. నిజానికి ఈ ఆలోచన తెలుగు సీనియర్ నటుడు అయిన నరేశ్‌ కూడా చేశారు. హైదరాబాద్‌ శివార్లలోని తన ఫామ్‌ హౌస్‌ లో సృజనకారులు ఉండి, అక్కడ రచన చేసుకునే ఏర్పాట్లను చేస్తున్నట్టు నరేశ్‌ గతంలో ప్రకటించారు. సో.. ఇప్పుడు 'ముసాఫిర్‌ కేఫ్‌'ను నెట్ ఫ్లిక్స్ లో సీరిస్‌ రూపంలో చూసి ఆనందించడమే కాకుండా రియల్‌ గానూ అందులో గడిపే అవకాశాన్ని విక్రాంత్‌ మాస్సే ఇస్తున్నాడనుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

Rashmika Mandanna: షూటింగ్‌కు వెళ్లాలంటే.. వణుకు పుట్టింది

మ‌ళ్లీ ఏమైందిరా.. వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్‌పై సస్పెన్స్

Husharu Pittalu: ఒరేయ్.. ఏం సినిమారా ఇది.. ఇంట్లోవాళ్లతో చూస్తే చెప్పుతో కొడతారు

Updated Date - Sep 21 , 2026 | 02:49 PM