The Vvaan: శతాబ్దాల ఎదురుచూపు. ‘ది వీవాన్’ అసలు కథ ఇదే!
ABN , Publish Date - Aug 24 , 2026 | 03:05 PM
సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘‘ది వీవాన్’ సినిమా రిలీజ్ డేట్, టీజర్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు.
సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘‘ది వీవాన్’ (The VVAAN) దీపక్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్నారు. అరుణాభ్ కుమార్ కథను అందించడంతో పాటు నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరిస్తున్నారు. శోభా కపూర్, ఏక్తా ఆర్. కపూర్, అరుణాభ్ కుమార్, నీరజ్ కొఠారి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా టీజర్ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ నెల 25న టీజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆలాగే సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
'సూర్యాస్తమయం తర్వాత ఎక్కడికి వెళ్లడం నిషిద్ధమో.. కథ అక్కడి నుంచే మొదలవుతుంది' సెప్టెంబర్ 25న ఆ గర్జన వినిపించబోతోంది' అంటూ కొత్త వీడియో గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ‘ది వీవాన్’ ఎవరు? అతడు శతాబ్దాలుగా దేని కోసం ఎదురుచూస్తున్నాడు? అనే ప్రశ్నలకు టీజర్‌లో సమాధానం దొరుకుతుందా? అన్న ఆసక్తి నెలకొంది. ఇందులో సునీల్ గ్రోవర్, మనీష్ పాల్, శ్వేతా తివారీ, సోనియా అన్ను కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రాను ఇప్పటివరకు చూడని కొత్త అవతార్‌లో చూపించబోతున్నారనే అంచనాలతో ఈ టీజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.