Mouni Roy: వివాహ బంధానికి స్వస్తి.. భరణం ప్రస్తావన లేదు..

ABN , Publish Date - May 18 , 2026 | 08:27 PM

తన భర్త సూరజ్‌ నంబియార్‌ నుంచి విడిపోతునట్లు బాలీవుడ్‌ నటి మౌనీరాయ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే!

తన భర్త సూరజ్‌ నంబియార్‌ నుంచి విడిపోతునట్లు బాలీవుడ్‌ నటి మౌనీరాయ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే! బాలీవుడ్‌కి చెందిన ఓ నటి కారణంగా వీరిద్దరూ విడిపోతున్నారని, భరణంగా భారీ మొత్తం తీసుకుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీటికి చెక్‌ పెడుతూ సూరజ్‌ ఓ పోస్ట్‌తో సమాధానం ఇచ్చారు. ఇద్దరం పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

‘మా విడాకుల గురించి వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలనుకుంటున్నా. మా ఇద్దరి మధ్య వివాదాలు లేదు. భరణం అన్న ప్రస్తావనే లేదు. ఇంకో వ్యక్తి ప్రమేయం కూడా లేదు. మేమిద్దరం మాట్లాడుకుని ఈ డెసిషన్‌ తీసుకున్నాం. పరస్పర గౌరవంతో విడిపోతున్నాం. ఎవరు ఎన్ని అనుకున్నా ఇదే నిజం. ఇలాంటి కథనాలను ఖండించకపోతే తప్పే అవుతుంది. అందుకే క్లారిటీ ఇచ్చా’ అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

నటి మౌనీరాయ్‌ 2022లో సూరజ్‌ను పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల వివాహబంధానికి ఇక ఫుల్‌స్టాప్‌ పెట్టాలనుకున్నట్లు నిర్ణయం తీసుకున్నట్లు ఇటీవల పోస్ట్‌పెట్టారు.

Updated Date - May 18 , 2026 | 08:44 PM