అతిలోక సుందరి జర్నీ.. శ్రీదేవి జీవితంపై ‘ఎంప్రెస్’ బయోగ్రఫీ
ABN , Publish Date - Aug 14 , 2026 | 07:16 AM
అతిలోక సుందరి శ్రీదేవి సినీ, వ్యక్తిగత జీవిత విశేషాలతో ‘ఎంప్రెస్ - ది డెఫినిటివ్ బయోగ్రఫీ ఆఫ్ శ్రీదేవి’ పుస్తకం విడుదల కానుంది.
అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi) సినీ, వ్యక్తిగతజీవిత విశేషాలతో ‘ఎంప్రెస్ (Empress) - ది డెఫినిటివ్ బయోగ్రఫీ ఆఫ్ శ్రీదేవి’ అనే పుస్తకం విడుదల కానుంది. ఈ విషయాన్ని ప్రముఖ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నారు.
‘మీరు ఎంతగానో గుర్తుకొస్తున్నారు. స్వర్గంలో ఉన్న మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. శ్రీదేవి త్వరలో వస్తోంది’ అని ఆమె రాశారు. ఈ పోస్టును శ్రీదేవి భర్త బోనీకపూర్ (Boney Kapoor) కూడా పంచుకున్నారు. శ్రీదేవి జీవిత చరిత్రను వెస్ట్‌ల్యాండ్ బుక్స్ ప్రచురిస్తున్నట్టు 2023లో ప్రకటించింది. ధీరజ్ కుమార్ (Dheeraj Kumar) ఈ పుస్తకాన్ని రచించారు.