రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ తో శ్రీలీల రెండో సినిమా..

ABN , Publish Date - Mar 03 , 2026 | 02:01 PM

అందాల భామ శ్రీలీల (Sreeleela) ఒక మంచి హిట్ కోసం ఎన్నాళ్లగానో ప్రయత్నిస్తున్నారు. కానీ, ఆమె నటించిన ప్రతి సినిమా భారీ పరాజయాన్ని చవిచూసింది.

Sreeleela

అందాల భామ శ్రీలీల (Sreeleela) ఒక మంచి హిట్ కోసం ఎన్నాళ్లగానో ప్రయత్నిస్తున్నారు. కానీ, ఆమె నటించిన ప్రతి సినిమా భారీ పరాజయాన్ని చవిచూసింది. ఇక టాలీవుడ్ కాకుండా కోలీవుడ్ లో పరాశక్తి సినిమా అయినా ఆమెకు హిట్ అందిస్తుందేమో అనుకున్నారు. అది కూడా శ్రీలీలకు కలిసిరాలేదు. ప్రస్తుతం ఈ కుర్ర హీరోయిన్ ఆశలన్నీ బాలీవుడ్ పైనే పెట్టుకున్నారు. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో శ్రీలీల ఒక సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం 2026 లోనే రిలీజ్ కానుందని సమాచారం.

ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే కార్తీక్ ఆర్యన్ - శ్రీలీల మధ్య ప్రేమ చిగురించిందని వార్తలు వినిపించాయి. గతేడాది వినాయక చవితి పండగను శ్రీలీల తన తల్లితో కలిసి కార్తిక్ ఆర్యన్ ఇంట్లోనే జరుపుకున్నారు. దీంతో వీరి డేటింగ్ వార్తలు నిజమేనని మాట్లాడుకున్నారు. ఇదంతా పక్కన పెడితే.. ఈ జంట తమ మొదటి సినిమా రిలీజ్ కాకముందే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ నడుస్తోంది.

కార్తిక్ ఆర్యన్ తో చందు చాంఫియన్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు కబీర్ ఖాన్.. మరో కథను వినిపించారని, అది నచ్చడంతో వెంటనే కార్తిక్ ఆర్యన్ ఓకే చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు టాక్ నడుస్తోంది. ఇది కూడా స్పోర్ట్స్ డ్రామా అని, ఇందులో కార్తిక్ ఆర్యన్ కోచ్ గా కనిపించనున్నారని అంటున్నారు. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - Mar 03 , 2026 | 02:21 PM